గాజాలో ఇజ్రాయెల్‌ కాల్పులు  | Israeli forces open fire at Gaza food sites, killing at least 5 Palestinians | Sakshi
Sakshi News home page

గాజాలో ఇజ్రాయెల్‌ కాల్పులు 

Jun 9 2025 5:41 AM | Updated on Jun 9 2025 5:41 AM

Israeli forces open fire at Gaza food sites, killing at least 5 Palestinians

కాల్పులకు బలైన వ్యక్తి మృతదేహంతో ర్యాలీ

ఐదుగురు పాలస్తీనియన్ల దుర్మరణం

గాజా: గాజాలో అన్నార్తులపై ఇజ్రాయెల్‌ మరోసారి కాల్పులకు తెగబడింది. ఇజ్రాయెల్, అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆహార పంపిణీ కేంద్రాల సమీపంలోనే ఆదివారం ఈ ఘోరం జరిగింది. కాల్పులకు ఐదుగురు పాలస్తీనా పౌరులు బలైనట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరికొందరు గాయపడ్డారని పేర్కొంది. అయితే తమ దళాలపై దాడులకు ప్రయతి్నంచిన వారిపై ప్రతి దాడులకు దిగినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. వివాదాస్పద సామాజిక కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌తోపాటు మరికొందరు గాజాకు వస్తున్న పడవను అడ్డుకుంటామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. 

ఆస్పత్రి కింద బంకర్‌: దక్షిణ గాజాలో ఖాన్‌యూనిస్‌లోని యూరోపియన్‌ ఆస్పత్రి కింద మరో భూగర్భ సొరంగం జాడను కనుగొన్నామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. సంబంధిత వీడియో విడుదలచేసింది. దీన్ని హమాస్‌ కమాండ్‌ సెంటర్‌గా వాడుతోందని ఆరోపించింది. 

Advertisement
 
Advertisement
Advertisement