హర్మూజ్‌ను మూసేస్తాం  | Iran may use threat of closing Strait of Hormuz | Sakshi
Sakshi News home page

హర్మూజ్‌ను మూసేస్తాం 

Jun 20 2025 4:36 AM | Updated on Jun 20 2025 4:36 AM

Iran may use threat of closing Strait of Hormuz

హెచ్చరించిన ఇరాన్‌ 

టెహ్రాన్‌: ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఖ్యాతికెక్కిన హర్మూజ్‌ జలసంధిని మూసేస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. సముద్రం ద్వారా రవాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం చమురు ఈ జలమార్గం నుంచే రవాణా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చము రు ధరలు పెరుగుతాయి. దీంతో పెట్రో ల్, డీజిల్‌ ధరలు సైతం పైకెగసి ప్రపంచ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూప నుంది. ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో హర్మూ జ్‌ జలసంధినిన మూసివేయాలనే ఒక ఆప్షన్‌ కూడా తమ వద్ద ఉందని గురువారం ఇరాన్‌ సైన్యాధికారి సర్దార్‌ ఇస్మాయిల్‌ కోసారీ ప్రకటించారు. 

ఏమిటీ హర్మూజ్‌ జలసంధి? 
పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే జలమార్గమిది. ఇరాన్, ఒమన్‌ల మధ్య నుంచి 33 కి.మీ.ల వెడల్పుతో ఈ మార్గం వెళ్తోంది. చమురు సరఫరా దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా,     ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నుంచి సహజవాయువు, ముడి చమురు నౌకలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. భారత్‌కు వచ్చే చమురులో ఎక్కువ శాతం క్రూడ్‌ ఆయిల్‌ ఈ రూట్‌ గుండానే వస్తోంది.   

 

Advertisement
 
Advertisement
Advertisement