Oil supply
-
దారి మళ్లిన ఇరాన్ చమురు నౌక..
ఇరాన్ నుంచి భారత్ రావాల్సిన ముడి చమురు నౌక తన దారి మార్చుకుంది. గుజరాత్‌లోని వాడినార్ పోర్టుకు రావాల్సిన ‘పింగ్ షున్’ అనే నౌక గమ్యస్థానాన్ని మార్చుకుని చైనా వైపు ప్రయాణిస్తోంది. చెల్లింపు నిబంధనల విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది.ఏమిటీ వివాదం?ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్ నుంచి సుమారు 6,00,000 బ్యారెళ్ల ముడి చమురుతో బయలుదేరిన ఈ నౌక భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. అయితే, చివరి నిమిషంలో అమ్మకందారులు క్రెడిట్ నిబంధనలను కఠినతరం చేయడంతో చిక్కుముడి పడింది. సాధారణంగా ఇరాన్ చమురు వ్యాపారంలో 30 నుంచి 60 రోజుల క్రెడిట్ గడువు ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో విక్రేతలు తక్షణమే లేదా స్వల్పకాలిక వ్యవధిలోనే నగదు చెల్లించాలని పట్టుబడుతున్నారు. భారత్ ఈ కఠిన నిబంధనలకు అంగీకరించకపోవడంతో సదరు నౌక తన దిశను మార్చుకుని చైనా వైపు మళ్లిందని అంతర్జాతీయ డేటా విశ్లేషణ సంస్థ ‘కెప్లర్’ వెల్లడించింది.అమెరికా ఊరట నిచ్చినా తప్పని తిప్పలుపశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, చమురు ధరల హెచ్చుతగ్గుల దృష్ట్యా మార్చి 20 లోపు లోడ్ అయిన ఇరాన్ నౌకలపై అమెరికా ప్రభుత్వం 30 రోజుల పాటు తాత్కాలికంగా ఆంక్షలను సడలించింది. ఈ వెసులుబాటును వినియోగించుకుని తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవాలని భారత్ భావించింది. కానీ, వాణిజ్య పరమైన చెల్లింపుల సమస్యలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. ‘చెల్లింపు సమస్యలు పరిష్కారమైతే ఈ కార్గో తిరిగి భారత రిఫైనరీలకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం లాజిస్టిక్స్ కంటే వాణిజ్య నిబంధనలే ఇరాన్ చమురు సరఫరాను శాసిస్తున్నాయి’ అని కెప్లర్ లీడ్ రీసెర్చ్ అనలిస్ట్ సుమిత్ రితోలియా తెలిపారు.తగ్గుతున్న రాయితీలుమరోవైపు, రష్యా, ఇరాన్ చమురుపై ఇన్నాళ్లూ లభించిన భారీ డిస్కౌంట్లు ఇప్పుడు క్రమంగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం, కొనుగోలుదారులు ఎక్కువ కావడంతో ఈ నౌకలపై డిస్కౌంట్లు తగ్గి కొన్ని సందర్భాల్లో ప్రీమియం ధరలు కూడా వసూలు చేస్తున్నట్లు ‘వొర్టెక్సా’ నివేదిక పేర్కొంది. రష్యా చమురుపై ఆంక్షల సడలింపు తర్వాత భారత దిగుమతులు పుంజుకున్నప్పటికీ, ఇరాన్ విషయంలో మాత్రం చెల్లింపుల చిక్కులు వీడటం లేదు. చైనా వంటి దేశాలు భారీగా దిగుమతులు చేసుకుంటున్న తరుణంలో భారత్ తన ఇంధన భద్రత కోసం ఇరాన్‌తో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించుకుంటుందో లేదో వేచి చూడాలి.ఇదీ చదవండి: ట్రంప్ పాచిక పారేనా? -
ఇంధన పొదుపునకు బంగ్లాదేశ్ కఠిన నిర్ణయాలు
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ అప్రమత్తమైంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, చమురు సరఫరా గొలుసులో అనిశ్చితి ఏర్పడటంతో తన దేశీయ ఇంధన అవసరాలను అదుపులో ఉంచుకోవడానికి అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, ప్రభుత్వ వ్యయాన్ని నియంత్రించడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించింది.కొత్త పని గంటలుపెరుగుతున్న ఇంధన ధరలు, చమురు సరఫరా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలను తక్షణమే అమలులోకి తెచ్చింది.ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పని చేస్తాయి. గతంలో అక్కడి ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేసేవి.మార్కెట్లు, షాపింగ్ మాల్స్ సాయంత్రం 6 గంటలకే మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.పారిశ్రామిక రంగంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలని, ముఖ్యంగా డెకరేటివ్ లైటింగ్(వేడుకల్లో ఉపయోగించే విద్యుత్)పై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.విద్యా రంగంలో మార్పులుపాఠశాలల పని వేళలపై విద్యాశాఖ త్వరలో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో.. పాఠశాల సమయాలను సర్దుబాటు చేయడం, అవసరమైతే ఆన్లైన్ తరగతులకు ప్రాధాన్యత ఇవ్వడం, కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గించేందుకు పాఠశాలల కోసం ఎలక్ట్రిక్ బస్సుల దిగుమతులకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించనున్నట్లు అంచనా.ఇదీ చదవండి: వంతెనలు.. అభివృద్ధికి వారధులు -
పెట్రోల్, డీజిల్ ఎక్కడెంత వాడుతున్నారంటే..
అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాకు విఘాతం కలుగుతుందనే ఆందోళనతో తెలుగు రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. నిమిషాల్లోనే బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు), డీలర్ అసోసియేషన్లు మాత్రం ‘కంగారు వద్దు.. సరిపడా నిల్వలు ఉన్నాయి’ అని భరోసా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం బైకులు, కార్లకే కాకుండా.. అసలు మన దేశంలో పెట్రోల్, డీజిల్ ఏయే రంగాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారో తెలుసుకుందాం.డీజిల్: దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంభారతదేశంలో చమురు వినియోగంలో సింహభాగం డీజిల్‌దే. ఇది కేవలం లారీలు, బస్సులకే పరిమితం కాదు. దేశీయంగా రవాణా రంగంలో (సుమారు 70 శాతం) దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువులను చేరవేసే భారీ ట్రక్కులు, గూడ్స్ వాహనాలు పూర్తిగా డీజిల్‌పైనే ఆధారపడి ఉన్నాయి. రైల్వే ఇంజిన్లలో కూడా గణనీయమైన భాగం ఇంకా డీజిల్‌తోనే నడుస్తున్నాయి.వ్యవసాయ రంగం (సుమారు 13%): రైతులకు డీజిలే ఆధారం. పొలం దున్నే ట్రాక్టర్లు, నీటిని తోడే పంపు సెట్లు, హార్వెస్టర్లు (కోత యంత్రాలు) పెట్రోల్ కంటే డీజిల్‌నే ఎక్కువగా వాడుతాయి. ముఖ్యంగా సాగు సీజన్లో ఈ వినియోగం రెట్టింపు అవుతుంది.పరిశ్రమలు, విద్యుత్ (సుమారు 10%): భారీ ఫ్యాక్టరీల్లోని జనరేటర్లు, విద్యుత్ గ్రిడ్ ఫెయిల్ అయినప్పుడు వాడే బ్యాకప్ పవర్ ప్లాంట్లకు డీజిల్ కీలకం. ఐటీ కంపెనీలు, మల్టీప్లెక్స్‌లు, ఆసుపత్రుల్లోని పవర్ బ్యాకప్ వ్యవస్థలు దీనిపైనే నడుస్తాయి.పెట్రోల్: వ్యక్తిగత ప్రయాణాలకే పరిమితమా?ద్విచక్ర వాహనాలు (సుమారు 60%): భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో అత్యధిక వాటా టూ-వీలర్లదే. మధ్యతరగతి ప్రజల ప్రధాన రవాణా సాధనం కావడంతో దీనిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రైవేట్ కార్లు (సుమారు 35%): వ్యక్తిగత వినియోగం కోసం వాడే కార్లు పెట్రోల్ వినియోగంలో రెండో స్థానంలో ఉన్నాయి.ఇతర రంగాలు: చిన్నపాటి గార్డెనింగ్ పరికరాలు, కొన్ని రకాల పడవలు (ఫిషింగ్ బోట్లు), కొన్ని జనరేటర్లలో తక్కువ మొత్తంలో పెట్రోల్ వాడుతుంటారు.ప్రజలు ఏం చేయాలి?ప్రస్తుతానికి దేశంలో చమురు నిల్వలు పటిష్టంగా ఉన్నాయని పెట్రోలియం శాఖ స్పష్టం చేస్తోంది. యుద్ధ భయంతో అవసరం లేకున్నా డబ్బాల్లో, బాటిళ్లలో ఇంధనాన్ని నిల్వ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇంధనం పొదుపు చేయడం అంటే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే. అనవసర భయాందోళనలకు లోనై బంకుల వద్ద రద్దీ పెంచకుండా సంయమనం పాటించడం ప్రస్తుత తరుణంలో చాలా అవసరం.ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన? -
సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద నిన్నటి నుంచి వాహనదారులు బారులు తీరుతున్నారు. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో ముడి చమురు సరఫరా నిలిచిపోతుందన్న ఆందోళన, చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ పరిమితులను తగ్గించాయన్న వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే, ఈ పరిణామాలపై తెలంగాణ పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టతనిచ్చింది.ఓఎంసీలు - డీలర్లు.. క్రెడిట్ విధానం అంటే ఏమిటి?ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి ప్రధాన కారణం చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే క్రెడిట్ (అప్పు) సౌకర్యంపై జరుగుతున్న చర్చ. సాధారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించిన సొమ్ము చెల్లించడానికి కొంత సమయం (క్రెడిట్ పీరియడ్) ఇస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల అస్థిరత వల్ల ఓఎంసీలు తమ రిస్క్‌ను తగ్గించుకోవడానికి డీలర్ల క్రెడిట్ పరిమితులను తగ్గించడం లేదా ‘క్యాష్ అండ్ క్యారీ’ (నగదు చెల్లించి స్టాక్ తీసుకోవడం) విధానాన్ని అమలు చేస్తున్నాయి. చేతిలో నగదు లభ్యత తక్కువగా ఉన్న చిన్న డీలర్లు క్రెడిట్ దొరకకపోవడంతో స్టాక్‌ను తక్కువగా ఆర్డర్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి తప్ప కంపెనీల వద్ద స్టాక్ లేక కాదని నిపుణులు చెబుతున్నారు.యుద్ధ ప్రభావం ఎంతవరకు?పశ్చిమాసియా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు సహజం. అయితే, భారత ప్రభుత్వం వద్ద వ్యూహాత్మక చమురు నిల్వలు ఉండటం వల్ల తక్షణమే ఇంధన సరఫరా నిలిచిపోయే అవకాశం లేదు. డీలర్లకు, కంపెనీలకు మధ్య ఉన్న అంతర్గత చెల్లింపుల వ్యవహారాలను వాహనదారులు కొరతగా భావించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాహనదారులు అనవసరంగా బంకుల వద్ద క్యూ కట్టి సమయాన్ని వృథా చేసుకోవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరఫరా సజావుగానే సాగుతోందని అధికారులు నిర్ధారించారు.కొరత లేదు.. ఆందోళన వద్దుతెలంగాణలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని రాష్ట్ర పెట్రోలియం డీజిల్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్) డిపోల వద్ద రాష్ట్ర అవసరాలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల సరఫరా ఆగిపోతుందనేది కేవలం ఊహాగానమేనని, ప్రస్తుతానికి దిగుమతులకు ఎలాంటి ఆటంకం లేదని తెలిపారు. అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని, ఆందోళనతో కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.కంపెనీల స్పందన..వదంతులను నమ్మొద్దు: బీపీసీఎల్భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. భారత్‌లో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. మా రిఫైనరీలు, సరఫరా కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి’ అని సంస్థ పేర్కొంది.చమురు కంపెనీల ఉమ్మడి ప్రకటనబీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ (హెచ్‌పీసీఎల్), ఇండియన్ ఆయిల్ (ఐఓసీఎల్) సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎల్పీజీ (ఎల్పీజీ) సరఫరా కూడా సుస్థిరంగా ఉందని వెల్లడించాయి. అందులోని వివరాల ప్రకారం.. ప్రస్తుత డిమాండ్‌ను తట్టుకోవడానికి సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. లాజిస్టిక్స్, రవాణా నెట్వర్క్ ఎక్కడా ఆగకుండా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఇరాన్ నుంచి రిలయన్స్ చమురు కొనుగోలుమరోవైపు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో భారత్‌కు ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల సడలింపు నేపథ్యంలో భారత దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 50 లక్షల బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.ఇదీ చదవండి: ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్! -
చిక్కుల్లో చమురు జీవనాడి
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం అంతర్జాతీయంగా చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్, ఒమన్ మధ్య ఉండే హార్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత బిజీ చమురు మార్గం. అంతర్జాతీయ చమురు సరఫరాలకు ఇది అత్యంత కీలకం. మొత్తం రోజువారీ చమురు, సహజవాయు సరఫరాల్లో 20 శాతం దీనిగుండానే జరుగుతూ ఉంటుంది. యుద్ధం దెబ్బకు ఇప్పుడక్కడ చమురు నౌకల రాకపోకలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా సిగ్నల్స్ జామ్ అవుతుండటంతో మూడు రోజులుగా నౌకలు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. దాంతో భారత్‌తో పాటు పలు దేశాలకు చమురు ఇక్కట్లు తలెత్తుతున్న పరిస్థితి! దీనికి తోడు ఇరాన్ దాడుల కారణంగా సౌదీ అరేబియా కూడా తాజాగా చమురు ఉత్పత్తిని భారీగా తగ్గించడం మూలిగే నక్కపై తాటిపండు చందంగా మారింది. ఈ పరిణామాలతో చమురు ధరలకు కూడా రెక్కలొస్తున్నాయి. ఇరుకైన మార్గం హార్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో అనుసంధానిస్తుంది. సౌదీ అరేబియాతో పాటు పశి్చమాసియాలోని ఇరాన్, ఇరాక్ తదితర దేశాల చమురు, ఖతర్, యూఏఈ ఉత్పత్తి చేసే సహజ వాయువు రవాణాకు హార్మూజ్ ఏకైక మార్గం. దీనిగుండా ఒక్కో నౌక వెళ్లడానికి అత్యంత ఇరుకైన మార్గాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దాంతో జలసంధిని దాటేదాకా అవి అత్యంత జాగరూకంగా ఉండాల్సిందే. ఇజ్రాయెల్–అమెరికా, ఇరాన్ దాడులను కాచుకునే క్రమంలో పరస్పరం జీపీఎస్ జామింగ్, సిగ్నల్ స్పూఫింగ్‌కు దిగుతున్నాయి. దాంతో ఈ ప్రాంతమంతా ఎల్రక్టానిక్ యుద్దక్షేత్రంగా మారిపోయింది. ఇది నౌకల సిగ్నలింగ్ వ్యవస్థలనూ ప్రభావితం చేస్తోంది. దాంతో అవి తీవ్ర గందరగోళానికి గురవుతున్నాయి. తమ నావిగేషన్ వ్యవస్థలు తప్పుడు పొజిషన్లను చూపుతున్నట్టు నౌకల కెపె్టన్లు వాపోతున్నారు. ఈ డిజిటల్ బ్లాకౌట్ దెబ్బకు హార్మూజ్ వద్ద ఏకంగా 1,100కు పైగా చమురు నౌకలు ఇరుక్కుపోయినట్టు ఉపగ్రహ చిత్రాలను బట్టి వెల్లడవుతోంది. ఎలక్ట్రానిక్ బ్లాకౌట్ నౌకలు తమ ప్రయా ణానికి ప్రధానంగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం (ఏఐఎస్)లపై ఆధారపడతాయి. ఇతర నౌకల పొజిషన్‌ను కూడా ఆ వ్యవస్థల ద్వారానే తెలుసుకుంటాయి. హార్మూజ్, పరిసర ప్రాంతాల్లో ఈ సిగ్నళ్లు రెండువైపులా దాడికి లోనవుతున్నాయి. మొదటిది జామింగ్. దీనివల్ల ఉపగ్రహాల సిగ్నళ్లు బలహీనమో, నిర్వీర్యమో అయిపోతున్నాయి. రెండోది స్పూఫింగ్. దీనిద్వారా నౌకల నావిగేషన్ కంప్యూటర్లు తప్పుడు కో ఆర్డినేట్స్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైన్యం వాడుతున్న దేశీయ కోబ్రా వీ8, సయ్యద్–4 ఎల్రక్టానిక్ యుద్ధ వ్యవస్థలు 250 కి.మీ. పరిధిలోని ఉపగ్రహ సిగ్నల్స్‌ను పూర్తిగా గందరగోళపరుస్తున్నాయి. తద్వారా తమ యుద్ధనౌకలను అమెరికా, ఇరాన్ బారినుంచి కాపాడుకోవడం ఇరాన్ లక్ష్యం. అయితే ఎల్రక్టానిక్ బ్లాకౌట్ ప్రభావం చమురు నౌకలపైనా తీవ్రంగా పడుతోంది. బ్లాకౌట్‌ను అధిగమించి హార్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటడం వాటికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. గుడ్డిగా ముందుకెళ్తే నౌకలు పరస్పరం ఢీకొనే ప్రమాదం పొంచి ఉండటంతో ఆపరేటర్లు రిస్కు తీసుకోవడం లేదు. దాంతో జపాన్, దక్షిణ కొరియా, భారత్, చైనా వెళ్లాల్సిన చమురు నౌకలు పదుల సంఖ్యలో లంగరు వేసి నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయ మార్గాలున్నా రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. పైగా ఆ మార్గాలను ఎంచుకునేందుకు నౌకా సంస్థలు కూడా సిద్ధంగా లేవు. దీనికి తోడు బీమా కంపెనీలు కూడా ఈ మార్గం గుండా సాగే నౌకల బీమా ప్రీమియాన్ని సగటున 50 శాతం దాకా పెంచేస్తున్నాయి! అంతేగాక యుద్ధం తాలూకు రిసు్కకు కవరేజీని నిరాకరిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హర్మూజ్‌ను మూసేస్తాం
టెహ్రాన్: ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఖ్యాతికెక్కిన హర్మూజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ హెచ్చరించింది. సముద్రం ద్వారా రవాణా అయ్యే చమురులో దాదాపు 25 శాతం చమురు ఈ జలమార్గం నుంచే రవాణా అవుతోంది. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పుండే ఈ జలమార్గం గుండా చమురు నౌకల రాకపోకలను అడ్డుకుంటే ప్రపంచవ్యాప్తంగా ముడి చము రు ధరలు పెరుగుతాయి. దీంతో పెట్రో ల్, డీజిల్ ధరలు సైతం పైకెగసి ప్రపంచ వాణిజ్యం, ఆర్థికాభివృద్ధిపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూప నుంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూ జ్ జలసంధినిన మూసివేయాలనే ఒక ఆప్షన్ కూడా తమ వద్ద ఉందని గురువారం ఇరాన్ సైన్యాధికారి సర్దార్ ఇస్మాయిల్ కోసారీ ప్రకటించారు. ఏమిటీ హర్మూజ్ జలసంధి? పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే జలమార్గమిది. ఇరాన్, ఒమన్‌ల మధ్య నుంచి 33 కి.మీ.ల వెడల్పుతో ఈ మార్గం వెళ్తోంది. చమురు సరఫరా దేశాలైన ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సహజవాయువు, ముడి చమురు నౌకలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. భారత్‌కు వచ్చే చమురులో ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ ఈ రూట్ గుండానే వస్తోంది. -
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
-
కేంద్రమంత్రులకు సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: వంట నూనెలకు కొరత నెలకొన్న నేపథ్యంలో ఆవనూనెపై దిగుమతి సుంకం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు లేఖలు రాశారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు కొరత ఏర్పడినందున ఆవ నూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. సన్‌ఫ్లవర్ మాదిరిగా ఉండే ఆవాల నూనె కెనడాలో ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని తెలిపారు. ప్రస్తుతం ముడి ఆవ నూనెపై 38.5 శాతం, శుద్ధి చేసిన ఆవనూనెపై 45 శాతం దిగుమతి సుంకం ఉందన్నారు. దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ప్రతిబంధకంగా మారినందున వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కనీసం ఏడాది పాటు ఆవనూనెపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని లేఖలో సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. 60 శాతం విదేశాల నుంచే.. 2021–22లో దేశంలో వంటనూనెల వినియోగం 240 లక్షల మెట్రిక్ టన్నులు కాగా 40 శాతం మాత్రమే దేశీయంగా ఉత్పత్తి జరిగిందని, 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. 95 శాతం పామాయిల్ ఇండోనేషియా, మలేషియాల నుంచి దిగుమతి అవుతుండగా ఉక్రెయిన్, రష్యా నుంచి 92 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి జరుగుతోందని తెలిపారు. ఇరుదేశాల మధ్య తలెత్తిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వంటనూనెలకు తీవ్ర కొరత ఏర్పడి ఆ ప్రభావం వినియోగదారులపై పడిందన్నారు. ఫలితంగా సన్‌ఫ్లవర్‌తో పాటు ఇతర వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయన్నారు. విస్తృత తనిఖీలు.. టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో మూడింట రెండొంతుల మంది సన్‌ఫ్లవర్‌నే వినియోగిస్తుండగా పామాయిల్‌ను 28% మంది, వేరుశనగ నూనెను 4.3% మంది వాడుతున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. మార్కెట్లో వంటనూనెల సరఫరాకు ఇబ్బంది లేకుండా, కృత్రిమ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందన్నారు. విజిలెన్స్, పౌరసరఫరా, తూనికలు కొలతల శాఖలు విస్తృతంగా తనిఖీలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. కొరత లేకుండా వంటనూనెల సరఫరా, రోజువారీ ధరలు సమీక్షించేందుకు టాస్క్‌ఫోర్స్‌నూ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తయారీదారులు, దిగుమతిదారులు, రిఫైనరీలతో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏపీ ఆయిల్‌ఫెడ్ ద్వారా రైతు బజార్లలో సరసమైన ధరలకే నూనెలను విక్రయిస్తున్నామన్నారు. చదవండి: మడకశిరకు వైఎస్ జగన్ మరో వరం -
ఆయిల్‌కు అడ్వాన్స్ ఇస్తానని మోసం
కొత్తపేట : ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకుని, ఆస్పత్రి వాహనాలకు ఆయిల్ సరఫరా చేయాలంటూ ఓ పెట్రోల్ బంక్ మేనేజర్ వద్ద నుంచి రూ.40 వేలు కాజేసిన మోసగాడి ఉదంతమిది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఈవని రామచంద్రా పెట్రోలియం ప్రొడక్షన్ అండ్ సర్వీసెస్ (హెచ్‌పీ పెట్రోల్ బంక్) వద్దకు శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. మేనేజర్ వీవీఎస్ఎన్ బంగార్రావును కలిసి తాను స్థానిక ప్రభుత్వాస్పత్రి వైద్యుడిగా పరిచయం చేసుకున్నాడు. ఆస్పత్రి వాహనానికి రెగ్యులర్‌గా డీజిల్, ఇంజన్ ఆయిల్ పోయాలని, సొమ్ము ఒకేసారి ఇస్తామని చెప్పాడు. బంక్‌లో అరువు ఇవ్వమని బంగార్రావు చెప్పడంతో, ఆస్పత్రికి వస్తే అడ్వాన్స్ ఇస్తానని అతడు నమ్మించాడు. బంక్ యజమాని ఈవని సూర్యనారాయణ మూర్తి అనుమతితో బంగార్రావు అతడితో కలిసి ఆటోలో ఆస్పత్రికి వెళ్లాడు. ఎమర్జెన్సీ విభాగం వద్ద కూర్చోమని చెప్పి అతడు లోపలికి వెళ్లాడు. ఓ కాగితం తెచ్చి.. రూ.60 వేలు ఇస్తున్నట్టు రాసివ్వమన్నాడు. అనంతరం 25 నిమిషాల్లో తేరుకుని చూసుకునేసరికి చేతిలో కాగితం ఉంది. ప్యాంట్ జేబులో పెట్టిన కలెక్షన్ సొమ్ము రూ.40 వేలు అదృశ్యమయ్యాయి. దీంతో ఆస్పత్రి డాక్టర్లను, సిబ్బందిని ఆరా తీయగా, తమకేమీ తెలియదని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గ్రహించాడు. కాగితం ఇచ్చిన సమయంలో ముఖంపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని, తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని బంగార్రావు తెలిపాడు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. ఎస్సై ఎ.బాలాజీ దర్యాప్తు చేస్తున్నారు. -
చమురు రిఫైనరీపై మిలిటెంట్ల దాడి
* బలగాలపై మెషిన్గన్లతో కాల్పులు * ఉత్తర ఇరాక్‌కు నిలిచిపోనున్న చమురు సరఫరా బాగ్దాద్: ఇరాక్‌లో అంతర్యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఇప్పటికే ఉత్తర ఇరాక్‌లోని పలు పట్టణాలను ఆక్రమించుకున్న సున్నీ మిలిటెంట్లు బుధవారం దేశంలోకెల్లా అతిపెద్దదైన బైజీ చమురు రిఫైనరీపై దాడికి తెగబడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లోని సలాహిద్దీన్ ప్రావిన్సులో ఉన్న ఈ రిఫైనరీని కాపలాకాస్తున్న బలగాలపై తెల్లవారుజామున మెషిన్గన్లు, మోర్టార్ దాడులతో విరుచుకుపడ్డారు. రిఫైనరీ ఉన్న 75 శాతం ప్రాంగణాన్ని ఆక్రమించుకున్నారు. ఈ దాడిలో రిఫైనరీ ఆవరణలోని పలు చమురు ఉత్పత్తుల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. రిఫైనరీని మంగళవారమే మూసేసి ఉద్యోగులను అక్కడి నుంచి ఖాళీ చేయించడం వల్ల ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. రిఫైనరీ మిలిటెంట్లపరం కావడంతో ఉత్తర ఇరాక్‌కు చమురు సరఫరా నిలిచిపోనుంది. అయితే కీలక చమురు క్షేత్రాలు ఎక్కువగా బస్రా సహా ఇతర దక్షిణాది ప్రాంతాల్లో ఉండటంతో ప్రస్తుతానికి అవన్నీ క్షేమంగానే ఉన్నాయి. ప్రతిరోజూ 25 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసే ఇరాక్‌లో నెలకొన్న తాజా పరిణామాలను ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. మరోవైపు మిలిటెంట్లను నిలువరించడంలో విఫలమైన కీలక భద్రతా కమాండర్లపై ఇరాక్ ప్రధాని నూరీ అల్ మాలికీ వేటు వేశారు. అలాగే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడంలో తనకు మద్దతివ్వాలని రాజకీయ ప్రత్యర్థులను కలిసి కోరారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. తమ దేశంపైకి ఉగ్రవాదులను ఎగదోసిన దేశాలకు కూడా చివరకు ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. ద్రోన్ దాడులకు ఒబామా యోచన ఇరాక్‌లో సున్నీ మిలిటెంట్ల స్థావరాలపై ద్రోన్లతో దాడులకు పాల్పడే అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా యోచిస్తున్నట్లు ‘వైట్‌హౌస్’ వర్గాలు పేర్కొన్నాయి. మిలిటెంట్లను ఎదుర్కోవడంలో ఇరాక్ సేనలు వెనకబడినందునే ఈ దాడుల యోచన చేస్తున్నట్లు తెలిపాయి. మరోవైపు ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని కాపాడేందుకు అమెరికా ప్రభుత్వం 275 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. -
ఇరాక్‌పై ఆందోళన అక్కర్లేదు
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం న్యూఢిల్లీ: ఇరాక్ సంక్షోభం వల్ల భారత్‌కి చమురు సరఫరా సమస్యలేమీ తలెత్తబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరాకు ఢోకా లేకుండా భారత్ తగు చర్యలు తీసుకుంటోందని శనివారం కమోడిటీ మార్కెట్లపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాయారాం తెలిపారు. మరోవైపు, దేశీయంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలపై మరీ ఆందోళన చెందనక్కర్లేదని మాయారాం చెప్పారు. ఒకవేళ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినా కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయన్నారు.


