అక్టోబర్ 17 వరకు సౌదీకి ఇండిగో విమానాలు రద్దు | IndiGo Cancels All Saudi Arabia Flights To Riyadh Jeddah Dammam And Madinah Until October 1st, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 17 వరకు సౌదీకి ఇండిగో విమానాలు రద్దు

Oct 13 2026 2:58 PM | Updated on Oct 13 2026 3:07 PM

IndiGo cancels flights from Saudi Riyadh, Jeddah, Dammam and Madinah

రియాద్: సౌదీ అరేబియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో విమానయాన సంస్థ ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. రియాద్, జెడ్డా, దమ్మామ్, మదీనా నగరాలకు వెళ్లే విమానాలను, అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను కూడా అక్టోబర్ 17 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

"ప్రయాణికులు విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఇండిగో వెబ్‌సైట్‌లో తమ విమాన సర్వీసుల స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించింది. బుకింగ్ సమయంలో అందించిన సంప్రదింపు వివరాలకు ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ప్రయాణికులకు ఏవైనా సందేహాలు ఉంటే సహాయం చేయడానికి మా సహాయక బృందాలు అందుబాటులో ఉంటాయి," అని ఇండిగో తెలిపింది.

"మీ భద్రత, క్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యత. సురక్షితమైన కార్యకలాపాలను నిర్వహించడానికి మేము సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాము," అని ఇండిగో తన ప్రకటనలో పేర్కొంది.

సోమవారం రాత్రి, రియాద్ వైపు హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని తాము అడ్డుకుని ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించిన కొద్దిసేపటికే, తాము బాలిస్టిక్ క్షిపణితో విమానాశ్రయంపై దాడి చేశామని హౌతీలు తెలిపారు.

యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అధికారులు శనివారం వరకు మూసివేశారు. విమానాశ్రయ సౌకర్యాల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ పౌర విమానయాన సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: హౌతీ దెబ్బకు వణుకుతున్న సౌదీ?.. లక్షల కోట్లు బుగ్గిపాలేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement