లాహోర్/చండీగఢ్: పాకిస్తాన్‌లో గురునానక్ జయంతి వేడుకల్లో పాల్గొనే వంకతో వాఘా సరిహద్దు గుండా దాయాది దేశంలో అడుగుపెట్టిన 48 ఏళ్ల భారతీయురాలు మరుసటి రోజే కనిపించకుండాపోయారు. ఈ క్రమంలో పాకిస్తానీ పోలీసుల దర్యాప్తుతో ఆమె స్థానిక పాకిస్తానీయుడిని పెళ్లాడినట్లు వెల్లడైంది.
సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన పాక్ జాతీయుడిని పేరు, మతం మార్చుకుని వివాహం చేసుకుని అతడితో కలిసి ఎటో వెళ్లిపోయినట్లు లాహోర్‌లోని పాక్ పోలీసులు శనివారం తెలిపారు. ఆమె జాడ కోసం తాము కూడా వెతుకుతున్నామని చెప్పారు. పంజాబ్‌లోని కపుర్తలా జిల్లా అమేనీపూర్ గ్రామానికి చెందిన సరబ్‌జీత్ కౌర్ నవంబర్ మూడో తేదీన 2,000 మంది సిక్కు పర్యాటకులతో కలిసి పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు వెళ్లారు.
తర్వాతి రోజే ఫరూఖాబాద్ పరిధిలోని షేఖూపురాకు చెందిన నసీర్ హుస్సేన్‌ను ఆమె పెళ్లాడారు. కౌర్ పేరును నూర్‌గా మార్చుకున్నారు. కౌర్‌కు ఇప్పటికే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె భర్త కొన్నేళ్లుగా విదేశాల్లో ఉంటున్నారు. మరోవైపు. ఆమె పాకిస్తాన్ వ్యక్తిని పెళ్లి చేసుకున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
New footage shows, Sarbjit Kaur, Indian Sikh pilgrim on Pakistan visit, getting married to a local person.pic.twitter.com/fdOZnwXvcI
— Sidhant Sibal (@sidhant) November 15, 2025


