కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..

Fearless Man Kisses Massive King Cobra On Head - Sakshi

ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 

పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్‌. తను ఓ కింగ్‌ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్‌ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. 

ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్‌ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్‌ రేయ్‌..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి.  

ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top