-
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్ అటెండెంట్‌కి బలవంతంగా..
ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్ విమానంలో 61 ఏళ్ల డేవిడ్ అలాన్ బర్క్ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్ అటెండెంట్ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ సీటులో కూర్చొన్నాడు. అక్కడే ఓ మగ ఫ్లైట్ అటెండెంట్ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు టేకాఫ్ చేయడానికి ముందు ఫ్లైట్ అటెండెంట్ నుంచి డ్రింక్స్‌ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్‌కి నచ్చిన రెడ్ వైన్ ఆల్కాహాల్ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్ అటెండెంట్ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు. దీంతో ఫ్లైట్ అటెండెంట్ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్ ఆ ప్రయాణికుడి కాంప్లీమెంట్కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్ అటెండెంట్ డెల్టా ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని ఫోన్ కాల్ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు. అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్ అటెండెంట్. ఆ ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్‌ల రెడ్వైన్ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ నెల ఏప్రిల్ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. (చదవండి: సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్) -
Amritpal Singh: వివాహేతర సంబంధాలు.. వీడియో కాల్లో ముద్దులు..
చండీగఢ్: అమృత్‌పాల్ సింగ్.. కరుడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది. ఆరు రోజులుగా పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో తిరగుతూ దేశం దాటేందుకు ప్రయత్నిస్తున్న అతివాది. పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ప్రమాదకర వ్యక్తి. అయితే ఈయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు తెలిస్తే మాత్రం.. ఇతనిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అనుకుంటారు. అవును మరి సోషల్ మీడియాలో మనోడి వేషాలు మామూలుగా లేవు.. అమృత్‌పాల్ సింగ్‌కు చాలా మంది అమ్మాయిలు, వివాహితలతో సంబంధాలు ఉన్నట్లు ఓ జాతీయ వార్త సంస్థ వెల్లడించింది. సోషల్ మీడియాలో ఇతడు అనేక మంది మహిళలతో చాట్ చేసినట్లు పేర్కొంది. ఈ చాట్లతో పాటు 12 వాయిస్ మెసేజ్‌లను సేకరించింది. అమృత్‌పాల్ సింగ్ అమ్మాయిల అసభ్య వీడియోలను రికార్డు చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా పేర్కొంది. తనకు అమ్మాయిలతో కేవలం సాధారణ రిలేషన్షిప్ మాత్రమే కావాలని, సీరియస్ రిలేషన్షిప్ కోరుకోవడం లేదని అమృత్ పాల్ సింగ్ వాయిస్ మెసేజెస్‌లో చెప్పాడు. మహిళలకు ముక్కు మీద కోపం అని అన్నాడు. అలాగే ఓ మహిళ తన వివాహ సంబంధంపై ప్రభావం పడనంతవరకు వివాహేతర సంబంధాన్ని కొనసాగించేందుకు అంగీకరించిందని చెప్పుకొచ్చాడు. అమృత్‌పాల్ సింగ్ ఇన్స్టాగ్రాం ఖాతాలో అమ్మాయిల చాటింగ్ లిస్ట్ చాలా పెద్దగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక మందికి అతడు తరచు మెసేజ్‌లు పంపాడు. మన వివాహేతర సంబంధం ఖరారైంది అని ఓ మహిళతో, దుబాయ్‌లో హనీమూన్ చేస్కుందాం అని మరొకరితో చాట్ చేశాడు. వీటికి ఆ మహిళ లాఫింగ్ ఏమోజీస్‌తో రిప్లై ఇవ్వడం గమనార్హం. ముమ్మర గాలింపు.. మరోవైపు పంజాబ్ పోలీసులు అమృత్‌పాల్ సింగ్ కోసం ఆరు రోజులుగా వేట కొనసాగిస్తున్నారు. అతను మాత్రం సినిమా స్టైల్లో పోలీసుల కళ్లుగప్పి మారువేషంలో, వాహనాలు మార్చుతూ తిరుగుతున్నాడు. బైక్‌ను పక్కన పెట్టుకుని ఓ బండిపై అతను వెళ్తున్న ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయినా ఇప్పటివరకు అతని జాడ మాత్రం పోలీసులు కనుగొనలేకపోయారు. మహారాష్ట్ర పోలీసులు కూడా ఇతని కోసం అలర్ట్ అయ్యారు. చదవండి: నెల క్రితమే ఎన్నారై కిరణ్‌దీప్‌తో పెళ్లి.. అక్కడికి వీసా.. ప్లాన్ అదేనా? -
వికృత ప్రవర్తన: శవపేటికలోని అస్థిపంజరాలకు ముద్దు పెట్టి వీడియో..
'పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి' అన్న నానుడిలా కొంతమంది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అవి హద్దులు దాటి వికృతంగా మారితేనే ప్రమాదం. విచిత్ర ప్రవర్తనలతో పేరుగాంచాలనో లేక మరే ఏ ఉద్దేశ్యంగానో పాపం అదే వారిని కటకటాల పాలు చేయడం లేదా వారికే ప్రాణాంతకమవ్వడం జరుగుతుంది. అచ్చం అలాంటి ఓ ఘటన చైనాలో వెలుగుచూసింది. ఏం జరిగిందంటే.. చైనాలో 21 ఏళ్ల వ్యక్తి టీవీలో పలు ఆసక్తికర లైవ్ టెలీకాస్టింగ్లను ప్రసారం చేయడం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటాడు. తన ఇమేజ్ పెంచుకునేందుకో ఏమో తెలియదు గానీ.. ఓ చెత్త పని అనాలో లేదా విచిత్రమైన పని అనాలో తెలియని వికృత పని చేశాడు. ఓ స్మశానవాటికకు వెళ్లి అక్కడ శవపేటికలోని అస్థిపంజరాలను ముద్దు పెట్టుకుంటూ..లైవ్ వీడియో తీసి ప్రసారం చేశాడు. అలా మొత్తం మూడు శవపేటికలను తన స్నేహితుల సాయంతో ఓపెన్ చేసి.. ఆ ఆస్థిపంజరాలను, పుర్రెలను ముద్దు పెట్టుకోవడం వంటి విచిత్రమైన పనులు చేశాడు. దీన్ని గమినించిన సమీపంలోని గ్రామస్తులు పట్లుకుని పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఫలితంగా సదరు వ్యక్తికి తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటన గతేడాది మార్చిలో జరిగినట్లు సమాచారం. ఇలాంటి వికృతి చర్యలు నెక్రోఫిలియా లక్షణం అని, దీని కారణంగా మృతదేహాలతో ఇలాంటి విచిత్ర పనులు చేస్తుంటారని చైనాలోని నిపుణులు చెబుతున్నారు. అలాంటివారు మృతదేహాలపై వ్యామోహం పెంచుకుని ఇలాంటి చేష్టలకు దిగుతారని అంటున్నారు. (చదవండి: 'మా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామి భారత్": యూఎస్ పొగడ్తల జల్లు) -
పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో
అడవిలో జంతువులను దగ్గర నుంచి చూస్తేనే గుండె ఆగినంత పనైపోతుంది. పొరపాటున జంతువుల కంటపడితే.. ఇంకేమైనా ఉందా ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగు పెట్టాల్సిందే. ఇక పులి, చిరుత, సింహాల జోలికి పోకపోవడమే ఉత్తమం. వాటిని చూస్తేనే భయంతో ఒళ్లు జలదరిస్తుంది. . అదే వాటిని పక్కన పెట్టుకొని ఆటాలాడితే పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఓ యువతికి అలా జరగలేదు. ఎంచక్కా చిరుత దగ్గర కూర్చొని దానికి ముద్దు పెట్టింది. శక్తివంతమైన జంతువులలో చిరుత ఒకటి. చిరుత కంట పడిన ఏ జంతువైనా దాని బారి నుంచి, తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అత్యంత వేగంగా పరుగెత్తి వేటాడుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ఓ యువతి మాత్రం చిరుతతో రాసుకొని పూసుకొని తిరుగుతోంది. చిరుత పక్కన ఎలాంటి బెరుకు లేకుండా పడుకొని ఉంది. దానిని ప్రేమగా లాలించింది. అంతటితో ఆగకుండా ఏకంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం చేసింది. అయితే చిరుత కూడా ఏం అనకుండా యువతితో అంతే ప్రేమగా ప్రవర్తించడం విశేషం. కాగా, ఆ చిరుత యువతికి పెంపుడు జంతువుగా తెలుస్తోంది. ఆఫ్రికన్ యానిమల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరికొంతమంది చిరుతో యువతి చేష్టలు చూసి భయపడుతున్నారు. ‘ఒకే ఫ్రేమ్‌లో ఓ మై గాడ్.. చిరుత ఆమెకు ముద్దు పెట్టిందా.. అమె అసలు ఏం చేస్తోంది. చిరుతతో లిప్‌లాక్. ఒకే ఫ్రేమ్‌లో రెండు చిరుతలు.. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవర్.. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక చిన్న ప్రేమ, అనురాగం ఎంత దూరం తీసుకెళ్లగలదో ఇది చూపిస్తుంది.’ అని నెటిజన్లు కామెంట్ చేస్తుంటారు. చదవండి: Viral: పెళ్లి అంటే ఏంటి?.. పిల్లాడి దిమ్మతిరిగే సమాధానం.. నవ్వాపుకోలేరు! View this post on Instagram A post shared by African animals (@african_animal)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement