Unruly Passenger Arrested Forcibly Kisses Delta Flight Attendant - Sakshi
Sakshi News home page

విమానంలో పెద్దాయన పాడుపని..ఫ్లైట్‌ అటెండెంట్‌కి బలవంతంగా..

Published Sun, Apr 23 2023 3:36 PM

Unruly Passenger Arrested  Forcibly Kisses Delta Flight Attendant - Sakshi

ఇటీవల విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలకు సంబంధించి ఏదో ఒక ఘటనను తరుచుగా వింటున్నాం. అవన్నీ మరువకే మునుపే అచ్చం అలాంటి మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో సదరు ప్రయాణకుడు కటకటాల పాలయ్యాడు కూడా. ఈ ఘటన డెల్టా ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..ఏప్రిల్‌ 10న మిన్నెసోటా నుంచి అలస్కాకు ప్రయాణిస్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానంలో 61 ఏళ్ల డేవిడ్‌ అలాన్‌ బర్క్‌ అనే వృద్ధ ప్రయాణికుడు ఫ్లైట్‌ అటెండెంట్‌ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాడు. ఆ వృద్ధ ప్రయాణకుడు ఫస్ట్‌ క్లాస్‌ ప్యాసింజర్‌ సీటులో కూర్చొన్నాడు.

అక్కడే ఓ మగ ఫ్లైట్‌ అటెండెంట్‌ పనిచేస్తున్నాడు. సాదారణంగా ఫస్ట్‌ క్లాస్‌ ‍ప్రయాణికులు టేకాఫ్‌ చేయడానికి ముందు ఫ్లైట్‌ అటెండెంట్‌ నుంచి డ్రింక్స్‌ని స్వీకరిస్తారు. అయితే ఆ అటెండెంట్‌ ఆ వృద్ధ ప్రయాణికుడు బర్క్‌కి నచ్చిన రెడ్‌ వైన్‌ ఆల్కాహాల్‌ని అందించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు ఒకింత అసహనానికి గురయ్యాడు. ఆ తర్వాత భోజన ఆర్డర్‌లను తీసుకోవడానికి ఆ ఫ్టైట్‌ అటెండెంట్‌ వస్తుండగా.. ఆ ప్రయాణికుడు బర్క్‌ అతనిని అందంగా ఉన్నావంటూ బలవంతంగా ముద్దు పెట్టుకునే యత్నం చేశాడు.

దీంతో ఫ్లైట్‌ అటెండెంట్‌ ఒక్కసారిగా గురయ్యాడు. పాపం ఆ అటెండెంట్‌ ఆ ‍ప్రయాణికుడి కాంప్లీమెంట్‌కి ధన్యావాదాలు చెబుతూ వద్దు సార్‌ అంటూ వెనక్కి వెళ్లే యత్నం చేసిన మెడపై ముద్దు పెట్టే యత్నం చేశాడు. వాస్తవానికి ఆ ప్రయాణకుడు రెస్ట్‌రూమ్‌కి వెళ్లేందుకు లేచాడని ఆ తర్వాత తాను ఎదురపడగానే  అతను ఇలా అనుచితంగా ప్రవర్తించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఆ ఫ్టైట్‌ అటెండెంట్‌ డెల్టా ఎయిర్‌లైన్స్‌కి జరిగిన విషయాన్ని ఫోన్‌ కాల్‌ ద్వారా తెలయజేసి ఫిర్యాదు చేశారు.

అలాగే అతను తాగిన మత్తుమలోనే అలా ప్రవర్తించాడని, పైగా పైలట్‌ భోజనం ట్రైని కూడా పగలుగొట్టి భయబ్రాంతులకు గురిచేసేలా ప్రవర్తించాడని ఫిర్యాదు చేశాడు ఫ్లైట్‌ అటెండెంట్‌. ఆ ‍ప్రయాణికుడు నిద్రపోయే ముందు మరో రెండు గ్లాస్‌ల రెడ్‌వైన్‌ని అడిగినట్లు సమాచారం. ఈ మేరకు ఆ విమానం ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే అధికారులు ఆ వికృత వృద్ధ ప్రయాణికుడిరి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.  ఈ నెల ఏప్రిల్‌ 27న కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంది. 

(చదవండి: సెప్టెంబర్‌లో భారత్‌కు బైడెన్‌)

Advertisement
 
Advertisement
 
Advertisement