బాలా, పూజా చుంబనాలు | Director Bala and Actress Pooja Kisses each other | Sakshi
Sakshi News home page

బాలా, పూజా చుంబనాలు

Sep 2 2014 12:51 AM | Updated on Apr 3 2019 9:13 PM

బాలా, పూజా చుంబనాలు - Sakshi

బాలా, పూజా చుంబనాలు

దర్శకుడు బాలా, నటి పూజా పరస్పర చుంబన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు కోలీవుడ్‌లో కలకలం పుట్టిస్తున్నాయి. సాధారణంగా నటీనటులు

దర్శకుడు బాలా, నటి పూజా పరస్పర చుంబన దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలు కోలీవుడ్‌లో కలకలం పుట్టిస్తున్నాయి. సాధారణంగా నటీనటులు ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం పరిపాటి. ఇక్కడ దర్శకుడు, నాయకి ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడంతో రకరకాల వదంతులు హల్‌చల్ చేస్తున్నాయి. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బాలా. ఈయన దర్శకత్వం వహించిన నాన్ కడవుల్ చిత్రంలో ఆర్య హీరోగాను, పూజా హీరోయిన్‌గాను నటించారు. ఇందులో అంధురాలిగా నటించిన పూజా నటనకు పలువురి ప్రశంసలు లభించాయి.
 
 అయితే తరువాత బాలా తన పరదేశి చిత్రంలో అవకాశం ఇచ్చినా పూజా నటించలేదు. కారణం సింగిల్ చిత్రాలతో బిజీగా వున్నానని చెప్పింది. కొంత కాలంగా అవకాశాలు లేకనో, ఇతర కారణాల వల్లనో నటనకు దూరంగా ఉన్న పూజా ఇప్పుడు మళ్లీ నటించడానికి సిద్ధం అయ్యింది. దీంతో ఇటీవల దర్శకుడు బాలాతో కలసి అవకాశం అడిగిందట. అంతటితో ఆగకుండా అనూహ్యంగా ఆయనపై ముద్దుల వర్షం కురిపించడం ప్రతిగా ముద్దివ్వమనడంతో బాలా కూడా పూజా బుగ్గలపై ముద్దు పెట్టేశారు. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో రకరకాల వదంతులకు దారి తీస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement