ఫ్రాన్స్‌లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి | europe heatwave record germany spain italy roads melt schools close forest fires | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌లో వడగాలుల బీభత్సం.. వెయ్యి మంది మృతి

Jun 28 2026 7:46 PM | Updated on Jun 28 2026 7:50 PM

europe heatwave record germany spain italy roads melt schools close forest fires

పారిస్: ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అధిక వేడులతో వడ గాలుల కారణంగా దాదాపు 1,000 మందికి పైగా మృతిచెందినట్లు ఆ దేశం ప్రకటించింది. అదే విధంగా జర్మనీ, స్పెయిన్, బ్రిటన్‌తో సహా 16 దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఆ ఏడాది నమోదైనట్లు పేర్కొంది.

ఐరోపా ప్రస్తుతం రికార్డు స్థాయిలో వేడిగాలుల బారిన పడుతోంది. ఈ తీవ్రమైన వేడి కారణంగా ఫ్రాన్స్‌లో దాదాపు 1,000 మంది అదనంగా మరణించారని తెలుస్తోంది. జూన్ 24 నుండి జూన్ 27 మధ్య మూడు రోజులలోనే ఫ్రాన్స్‌ వ్యాప్తంగా  ఈ మరణాలు సంభవించాయని నివేదికలు పేర్కొన్నాయి. రాజధాని పారిస్, పరిసర ప్రాంతాలలో మరణాలు కేసులు ఉన్నాయని మృతులలో అధికంగా వృద్ధులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే సమయంలో, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్, డెన్మార్క్, ఇటలీ స్విట్జర్లాండ్‌తో సహా 16 దేశాలలో ఉష్ణోగ్రతలు దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టాయి.

అయితే యూరప్‌లో 35 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అక్కడి రోడ్లు కరిగిపోతున్నాయని అనేక ప్రాంతాలల కార్చిచ్చులు చెలరేగుతున్నాయనిల అధికారులు పేర్కొన్నారు. ప్రపంచ సగటు కంటే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో బ్రిటన్ చరిత్రలోనే  తొలిసారిగా, వరుసగా మూడు రోజుల పాటు రెడ్ వార్నింగ్ హెచ్చరికలు జారీ చేశారు. 

బ్రిటన్‌లో జూన్ నెలకు సంబంధించి ఈ వారం వరుసగా మూడు రోజుల పాటు బద్దలైందని అధికారులు పేర్కొన్నారు. బ్రిటన్ వ్యాప్తంగా వెయ్యికి పైగా పాఠశాలలను మూసివేయవలసి వచ్చిందని తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా ఇనుప రైలు పట్టాలు వ్యాకోచించి, వంగిపోతున్నాయని తెలిపారు. దీనివల్ల రైళ్లపై కఠినమైన వేగ పరిమితులను గంటకు గరిష్ఠంగా 60 మైళ్లకు తగ్గించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement