పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎలాన్‌ మస్క్‌

Elon Musk Again Sensational Comments On Putin - Sakshi

శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్‌ ఎలాన్‌ మస్క్‌.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్‌ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్‌ వ్యాఖ్యానించారు. 

‘ఎక్స్‌’ స్పేసెస్‌ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్‌ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్‌ చెప్పారు. 

అయితే మస్క్‌ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్‌)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్‌ తేల్చేశారు. 

అదే సమయంలో రష్యాతో స్పేస్‌ ఎక్స్‌ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్‌.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌ స్టార్‌లింక్‌ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్‌ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top