
మూడు నెలల్లోనే బయటికి వచ్చిన వినయ్ ప్రసాద్
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన శాస్త్రవే త్త, ఆంకాలజిస్ట్ డాక్టర్ వినయ్ ప్రసాద్ ఎఫ్‌డీఏ నుంచి వైదొలిగారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రరేషన్ (ఎఫ్‌డీఏ) వేక్సిన్ చీఫ్ అయిన వినయ్.. సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యు యేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా నియమితులైన నియమితులైన ఆయన మూడు నెలల్లోనే బయటికి వచ్చారు.
డుచెన్ కండరాల బలహీనతకు జన్యు చికిత్సను ఇటీవల సారెప్టా థెరప్యూటిక్స్ నుంచి ఏజెన్సీ నిర్వహించింది. ఎఫ్‌డీఏ–ఆమోదించిన చికిత్సను వ్యాధితో బాధ పడుతున్న ఇద్దరు టీనేజర్లపై ప్రయోగించారు. వారిద్దరూ మరణించారు. ఇటీవలే జూలై 18న మరో మరణం సంభవించింది. దీంతో ఆమో దించిన డీఎండీ చికిత్సతోపాటు అన్ని సరుకు లను నిలిపివేయమని సారెప్టాను ఎఫ్‌డీఏ కోరింది. దీనికి భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంది.
దీంతో.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రురాలు లారా లూమర్ తన బ్లాగులో ఓ పోస్ట్‌చేశారు. అందులో ఆమె ప్రసాద్‌ను ప్రగతి శీల వామపక్ష విధ్వంసకారుడని అభివర్ణించారు. అంతేకాదు.. అతను ఏజెన్సీ పనిని బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో లూమర్ విమర్శలు జాతీయ భద్రతా అధికారులను తొలగించటానికి దారి తీశాయి.
దీంతో ప్రసాద్‌ను విమర్శిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయ విభాగం రెండు వ్యాసా లు ప్రచురించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వినయ్ ప్రసాద్ పదవి నుంచి వైదొలిగారు. ప్రసాద్.. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఏజెన్సీలో చేరిన వైద్యుడు. ఆయన నేషనల్ కేన్సర్ ఇనిస్టి ట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో పనిచేశారు. యూఎస్ కోవిడ్–19 వేక్సిన్, మాస్క్ ఆదేశాలను ఆయన తీవ్రంగా విమర్శించారు.