breaking news
Indian-origin doctor
-
ఎఫ్‌డీఏ నుంచి వైదొలిగిన భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన శాస్త్రవే త్త, ఆంకాలజిస్ట్ డాక్టర్ వినయ్ ప్రసాద్ ఎఫ్‌డీఏ నుంచి వైదొలిగారు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రరేషన్ (ఎఫ్‌డీఏ) వేక్సిన్ చీఫ్ అయిన వినయ్.. సెంటర్ ఫర్ బయోలాజిక్స్ ఎవాల్యు యేషన్ అండ్ రీసెర్చ్ (సీబీఈఆర్) డైరెక్టర్‌గా నియమితులైన నియమితులైన ఆయన మూడు నెలల్లోనే బయటికి వచ్చారు. డుచెన్ కండరాల బలహీనతకు జన్యు చికిత్సను ఇటీవల సారెప్టా థెరప్యూటిక్స్ నుంచి ఏజెన్సీ నిర్వహించింది. ఎఫ్‌డీఏ–ఆమోదించిన చికిత్సను వ్యాధితో బాధ పడుతున్న ఇద్దరు టీనేజర్లపై ప్రయోగించారు. వారిద్దరూ మరణించారు. ఇటీవలే జూలై 18న మరో మరణం సంభవించింది. దీంతో ఆమో దించిన డీఎండీ చికిత్సతోపాటు అన్ని సరుకు లను నిలిపివేయమని సారెప్టాను ఎఫ్‌డీఏ కోరింది. దీనికి భద్రతా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. దీంతో.. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రురాలు లారా లూమర్ తన బ్లాగులో ఓ పోస్ట్‌చేశారు. అందులో ఆమె ప్రసాద్‌ను ప్రగతి శీల వామపక్ష విధ్వంసకారుడని అభివర్ణించారు. అంతేకాదు.. అతను ఏజెన్సీ పనిని బలహీన పరుస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం ప్రారంభంలో లూమర్ విమర్శలు జాతీయ భద్రతా అధికారులను తొలగించటానికి దారి తీశాయి. దీంతో ప్రసాద్‌ను విమర్శిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ అభిప్రాయ విభాగం రెండు వ్యాసా లు ప్రచురించింది. ఈ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వినయ్ ప్రసాద్ పదవి నుంచి వైదొలిగారు. ప్రసాద్.. శాన్ఫ్రాన్సిస్కోలోని కాలి ఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి ఏజెన్సీలో చేరిన వైద్యుడు. ఆయన నేషనల్ కేన్సర్ ఇనిస్టి ట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో పనిచేశారు. యూఎస్ కోవిడ్–19 వేక్సిన్, మాస్క్ ఆదేశాలను ఆయన తీవ్రంగా విమర్శించారు. -
టిండర్‌లో పోకిరీ: యూకేలో భారత సంతతి వైద్యుడికి గట్టి ఝలక్
లండన్: ఆన్లైన్ డేటింగ్ యాప్ టిండర్‌లో పరిచయమైన మహిళపై లైంగిక వేధింపులు, దాడికి పాల్పడిన భారత సంతతికి చెందిన వైద్యుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో డాక్టర్ మనేశ్ గిల్‌ను దోషిగా నిర్ధారించిన స్కాటిష్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. టిండర్ యాప్‌లో మైక్ అనే పేరుతో బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు గిల్. ఈ క్రమంలో డిసెంబరు 2018లో స్టిర్లింగ్‌లోని ఒక హోటల్లో మీట్ అయ్యేందుకు నిర్ణయించుకున్నారు. కానీ పథకం ప్రకారం ముందుగానే రూం బుక్ చేసుకున్న అతగాడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం ఎడిన్‌బర్గ్‌లోని హైకోర్టు నేరస్తుడిగా నిర్ధారించింది. దీంతో అతనికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు తాజా తీర్పు చెప్పింది. అలాగే గిల్ ప్రవర్తనను పర్యవేక్షణ నిమిత్తం లైంగిక నేరస్థుల రిజిస్టర్లో కూడా చేర్చింది ‘‘భయంకరమైన ప్రవర్తనకు గిల్ పరిణామాన్ని ఎదుర్కొంటున్నాడు. గిల్‌కు శిక్ష విధించడం లైంగిక నేరాలకు పాల్పడేవారికి చెంపపెట్టు లాంటి మెసేజ్ అస్తుందని స్కాట్లాండ్ పబ్లిక్ ప్రొటెక్షన్ యూనిట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోర్బ్స్ విల్సన్. అలాగే బాధితురాలు ధైర్యంగా ముందుకొచ్చి తనకు ఎదురైన భయంకర అనుభవాలను సాహసంగా వెల్లడించిందన్నారు. విచారణలో ఆమె పూర్తిగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ తీర్పు ఆమెకు కొంత ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నానన్నారు. మరోవైపు ఈ కేసు విచారణలో బాధిత మహిళ తాను నర్సింగ్ విద్యార్థినని వెల్లడించింది. ఈ వేధింపుల పర్వంతో తాను అనుభవించిన మానసిక వేదనను విచారణ అధికారుల ముందు వివరించింది. కాగా పరస్పర అంగీకారంతోనే జరిగిందని, తాను లైంగిక దాడి చేయలేదని గిల్ వాదించాడు. అయినా కోర్టు బాధితురాలి వాదనను సమర్థించింది. మనేశ్ గిల్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
అమెరికాలో భారతీయుడి ఘాతుకం
హూస్టన్: అమెరికాకు చెందిన భరత్ నారుమంచి అనే భారతీయ డాక్టర్ మరో మహిళా డాక్టర్‌ను కాల్చి చంపాడు. అనంతరం భరత్ సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే భరత్‌కు టెర్మినల్ క్యాన్సర్ నిర్ధారణైందని పోలీసులు తెలిపారు. టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ నగరం చిల్డ్రన్స్ మెడికల్ గ్రూప్ ఆఫీసుల్లోకి డాక్టర్ భరత్ తుపాకీతో వచ్చి ఐదుగురిని బందీలుగా పట్టుకున్నాడు. అందరూ తప్పించుకోగలిగినా కాథరిన్ డాడ్సన్ అనే డాక్టర్ మాత్రం చిక్కుకుపోయారు. పోలీసులు బలవంతంగా బిల్డింగ్‌లోకి ప్రవేశించగా డాడ్సన్, భరత్ చనిపోయి కనిపించారు. డాడ్సన్‌ను కాల్చిచంపిన అనంతరం భరత్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. -
భారత సంతతి వైద్యుడికి యూకేలో అరుదైన గౌరవం
లండన్: భారత సంతతికి చెందిన వైద్యునికి బ్రిటన్‌లో అరుదైన పురస్కారం దక్కింది. కరోనావైరస్ సంక్షోభంలో చేసిన సేవలకుగానూ నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడు రవి సోలంకికి బ్రిటన్ రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేక అవార్డు లభించింది. కరోనా రోగులకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఆయన తీవ్రంగా కృషి చేశారు. (చదవండి : 24 గంటల్లో భారత్‌లో 55,079 పాజిటివ్) అలాగే మెషిన్ లర్నింగ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న రేమండ్ సీమ్స్‌తో కలిసి న్యూనేషన్ హెల్త్ సర్వీస్(ఎన్హెచ్ఎస్) స్వంస్చంధ సంస్థ హీరోస్ కోసం ఓ వెబ్‌సైట్‌ను రూపొందించి కోవిడ్ వ్యాధికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చినట్లు అకాడమీ ప్రతినిధులు తెలిపారు. రికార్డ్ టైంలో సమర్థవంతమైన వెబ్‌సైట్‌ను నెలకొల్పి కరోనా వారియర్లలకు సేవలందిచినందుకుగాను ఈ అవార్డు వారికి దక్కింది. ఈ వెబ్సైట్ ద్వారా స్వచ్ఛంధంగా నిధులను సేకరించడంతో పాటు, కరోనాపై కౌన్సిలింగ్, కోవిడ్ బాధితులకు మద్దతుగా నిలిచిన ఎన్హెచ్ఎస్ కార్మికులకు పీపీఈ కిట్లను అందించడంతో తీవ్రంగా కృషి చేశారు. రవితో పాటు మరో 19 మంది కూడా ఈ పురస్కారానికి ఎంపియ్యారు. (చదవండి : 10 రెట్లు ఎక్కువ ముప్పు) -
అందుబాటులో 'ఆర్డర్ ఏ డాడీ' యాప్..!
లండన్ః ఆన్ లైన్ లో తగిన భర్తను ఎంచుకొని పెళ్ళిళ్ళు చేసుకునే కాలానికీ ఇక కాలం చెల్లనుంది. ఏకంగా వివాహ బంధం, సంసార జీవితం కొనసాగించాల్సిన అవసరం లేకుండానే మహిళలు ఆన్ లైన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని, తమ పిల్లలకు ఓ మంచి తండ్రిని ఎంచుకునే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసింది. మహిళలు సంతానోత్సత్తికోసం నచ్చిన పురుషుడి వీర్యాన్ని పొందే అవకాశం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. భారత సంతతికి చెందిన ఓ లండన్ వైద్యుడు కొత్తగా సృష్టించిన యాప్ తో మహిళలు ప్రపంచంలో ఎక్కడైనా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని ఎంచుకొని పిల్లలను కనే అవకాశం కల్పించాడు. 'ఆర్డర్ ఏ డాడీ' పేరున ఈ సదవకాశాన్ని అందుబాటులోకి తెచ్చాడు. లండన్ లోని సైంటిఫిక్ స్మెర్మ్ బ్యాంకు డైరెక్టర్ డాక్టర్ కమల్ అహుజా.. సంతానోత్సత్తికోసం ఈ వినూత్న యాప్ ను రూపొందించాడు. తల్లికావాలనుకున్న స్త్రీలకోసం 'ఆర్డర్ ఏ డాడీ యాప్' సృష్టించాడు. ఈ యాప్ ద్వారా తమకు నచ్చిన పురుషుడి వీర్యాన్ని ఎంచుకొని, దానిద్వారా పిల్లలను కనే అవకాశం కల్పించాడు. ఈ పద్ధతి పూర్తిగా చట్టబద్ధమైనదని, యాప్ ద్వారా వీర్యాన్ని పొందాలనుకునేవారు 950 పౌండ్లు చెల్లించి, కోరుకున్న సంతానోత్సత్తికేంద్రంలో వీర్యాన్ని పొందొచ్చని డాక్టర్ కమల్ అహూజా చెప్తున్నాడు. యాప్ ద్వారా వీర్యాన్ని ఎంచుకోవాలనుకున్నవారు యాప్ లో పొందుపరిచిన పలువురు పురుషుల శరీరాకృతి, రంగు, కనుముక్కుతీరులతో కూడిన ఫోటోలను చూసి స్పెర్మ్ ను ఎంచుకునే వెసులుబాటును కల్పించాడు. అలాగే సదరు పురుషుల విద్య, వృత్తి, స్థాయిల వివరాలను వ్యక్తిత్వ లక్షణాలను కూడా యాప్ లో పరిశీలించే అవకాశం ఉంది. ఈ కొత్త 'ఆర్డర్ ఏ డాడీ యాప్' కు బ్రిటన్ లో అత్యంత ఆదరణ లభిస్తున్నట్లు డాక్టర్ అహూజా చెప్తున్నాడు. సంతానోత్సత్తికోసం రూపొందించిన ఈ యాప్ ప్రపంచంలో మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా విడుదల చేసినట్లు అతడు పేర్కొన్నాడు. ఇప్పటికే బ్రిటన్ సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో వీర్యం ఆర్డర్ల క్రేజ్ పెరిగిందని, ఆన్ లైన్ లోనే వీర్యం ఆర్డర్ చేసి అతి సులభంగా సంతానోత్సత్తిని పొందేందుకు మహిళలకు ఇదో గొప్ప అవకాశమని డాక్టర్ అహూజా వెల్లడించాడు. -
ఎన్నారై డాక్టర్ కు 8 ఏళ్ల జైలు
లండన్: మహిళా రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఎన్నారై వైద్యుడు జైలు పాలయ్యాడు. బ్రిటన్ లో గైనకాలిస్ట్ గా పనిచేస్తున్న మహేశ్ పటవర్థన్ కు వూల్ విచ్ క్రౌన్ కోర్టు ఎనిమిదేళ్ల కోర్టు జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువరించినప్పుడు అతడి భార్య, కుమారుడు, కుమార్తె.. కోర్టులోనే ఉన్నారు. వూల్ విచ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రి, లూయిస్ హామ్ లోని బ్లాక్ హీత్ ఆస్పత్రిలో పటవర్థన్ పనిచేశాడు. 2008, జూలై 31- 2012, సెప్టెంబర్ 24 మధ్యకాలంలో పలువురు మహిళా రోగులను అతడు లైంగిక వేధింపులకు గురిచేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. డాక్టర్ పటవర్థన్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసిన బాధిత మహిళ ఒకరు కోర్టుకు తెలిపింది. తనపై వచ్చిన ఆరోపణలను పటవర్థన్ తోసిపుచ్చాడు. కాగా, జనరల్ మెడికల్ అసోసియేషన్(జీఎంసీ) అతడి సభ్యత్వాన్ని రద్దు చేసింది. -
భారతీయ సంతతికి చెందిన వైద్యుడుకి జైలు శిక్ష
న్యూయార్క్ : బాలికకు మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడుతూ... ఆ దృశ్యాలను ఫొటో తీస్తున్న భారతీయ సంతతికి చెందిన వైద్యుడికి యూఎస్ కోర్టు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి.... భారతీయ సంతతికి చెందిన వైద్యుడు రాకేష్ పన్ను (57) చిన్న పిల్లల వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు చికిత్స కోసం వచ్చే చిన్నారులు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని మాయ మాటలు చెప్పి... వారి తల్లిదండ్రులను బయటే ఉంచి... గదిలో బాలికకు మత్తు మందు ఇచ్చి... లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఆపై ఆ దృశ్యాలను ఫొటో తీసేవాడు. ఆ విషయాన్ని ఓ బాలిక తన తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దాంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో 2010లో రాకేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులోభాగంగా రాకేష్ నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో యూఎస్ కోర్టు అతడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
యూఎస్‌లో దీపక్ దేశాయికి ఆరేళ్ల జైలు శిక్ష
హోస్టన్: హెల్త్ ఇన్సురెన్స్‌లో మోసానికి పాల్పడినందుకు యూఎస్ లోని భారతసంతతికి చెందిన డాక్టర్‌కు 71 నెలల జైలు శిక్ష ఖరారైంది. అంతేకాకుండా అక్రమంగా వసూలు చేసిన 2.2 మిలియన్ డాలర్లని తిరిగి కట్టాల్సిందిగా శుక్రవారం కోర్టు ఆదేశించింది. భారత సంతతికి చెందిన దీపక్ దేశాయి(65) లాస్‌వెగాస్‌లో ఎండోస్కోపీ సెంటర్‌ని నడుపుతున్నాడు. అనిస్థీషియా సేవలకోసం సీనియర్ సిటిజన్స్, పేదల దగ్గర నుంచి యూఎస్ హెల్త్ ఇన్సురెన్స్ సిస్టమ్ నిర్ధారించిన నిబంధనలకి విరుద్ధంగా వసూళ్లకి పాల్పడ్డాడు. దేశాయి తన నేరాన్ని అంగీకరించడంతో జడ్జి 71నెలల శిక్ష విధించింది. అంతేకాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడిన సొమ్మును తిరిగి కట్టాల్సిందిగా దేశాయిని కోర్టు ఆదేశించింది.