రష్యాకు ఆంక్షలతో చుక్కలు చూపిస్తే గానీ..! | Donald Trump Warns Putin Over Ukraine | Sakshi
Sakshi News home page

రష్యాకు ఆంక్షలతో చుక్కలు చూపిస్తే గానీ..!

Apr 26 2025 9:08 PM | Updated on Apr 26 2025 9:12 PM

Donald Trump Warns Putin Over Ukraine

వాషింగ్టన్:  ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆపేలా కనబడే చాయలు ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే శాంతి  ఒప్పందం అంటూనే మరొకవైపు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు పుతిన్. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకూ ఏమీ ఫలించలేదు. తాజాగా ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమంటూ యూఎస్ కు సందేశం పంపిన పుతిన్ పై ట్రంప్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.

యుద్ధాన్ని ఆపుతామనే చెబుతున్నాడు కానీ ఎక్కడా అది కనిపించడం లేదని పుతిన్ శైలిపై కాస్త అసహనం వ్యక్తం చేశారు ట్రంప్. ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్’లో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రధానంగా ఇటీవల ఉక్రెయిన్ జనావాసాల్లో రష్యా జరిపిన దాడిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  అసలు జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో పుతిన్ ఎందుకు దాడి చేశాడో సరైన కారణం లేదన్నాడు. ఇదే గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుందని, దీనివల్ల అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారన్నాడు.

ఇక పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనని ట్రంప్ తెలిపారు. పుతిన్ వ్యవహారాన్ని భిన్నంగా డీల్ చేయాలి. మాస్కో లక్ష్యంగా అదనపు ఆంక్షలు విధించి కట్టడి చేసే మార్గాన్ని చూస్తున్నాం. అని రాసుకొచ్చారు ట్రంప్.

ప్రస్తుతం ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం రష్యా నుంచి అమెరికా ఓ సందేశం వెళ్లింది. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉక్రెయిన్ తో చర్చలకు కూర్చుంటామని అమెరికాకు తెలిపినట్లు రష్యా శనివారం స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement