డీప్‌సీక్‌ హవా.. దిగ్గజ టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌! | Donald Trump Issues Warning Against Deepseek Ai | Sakshi
Sakshi News home page

డీప్‌సీక్‌ హవా.. దిగ్గజ టెక్‌ కంపెనీలకు ట్రంప్‌ వార్నింగ్‌!

Jan 28 2025 7:25 PM | Updated on Jan 28 2025 7:52 PM

Donald Trump Issues Warning Against Deepseek Ai

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) సిలికాన్‌ వ్యాలీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చాట్‌జీపీటీ తరహాలో రూపొందించిన చైనాకు చెందిన ఏఐ స్టార్టప్‌ ‘డీప్‌సీక్‌’ (deepseek)  పై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చైనా డీప్‌సీక్‌ విషయంలో సిలికాన్‌ వ్యాలీకి ఓ వేకప్‌ కాల్‌ అంటూ హెచ్చరించారు.  

అసలేం జరిగిందంటే..? 
కొద్ది రోజులు క్రితం అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన దిగ్గజ టెక్‌ కంపెనీ ఫౌండర్‌లు, కోఫౌండర్‌లు, సీఈవోతో మాటమంతి కలిపారు. అదే సమయంలో చైనా డీప్‌సీక్‌ తన ఆర్‌1 మోడల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. అయితే, ట్రంప్‌ ప్రమాణ స్వీకారం కారణంగా ఆర్‌1 మోడల్‌ గురించి పెద్దగా ఎవరీకి తెలియలేదు.

కానీ వారాంతంలో డీప్‌సీక్‌ చాట్‌బాట్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. యూఎస్ యాపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ స్థానంలో డీప్‌సీక్‌ చేరింది. చాట్‌ జీపీటీ సైతం డౌన్‌లోడ్‌ల విషయంలో డీప్‌సీక్‌ వెనక్కి నెట్టింది. దీంతో కృత్రిమ మేధా ప్రపంచంలో చైనా ఏఐ డీప్‌సీక్‌ దెబ్బకు ఇతర టెక్నాలజీ కంపెనీ షేర్లు.. బేర్‌ మన్నాయి. ముఖ్యంగా చిప్‌ తయారీ సంస్థలు ఊహించని స్థాయిలో నష్టాన్ని చవిచూశాయి. 

ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌ తయారీ సంస్థ ఎన్‌విడియా సోమవారం దాదాపు 17 శాతం నష్టాన్ని చవిచూసింది. ఎన్‌విడియా సైతం అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్‌ వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌లో ఒక రోజు లోనే అతిపెద్ద నష్టాన్ని మూగట్టుకుంది. నష్టం విలువ సుమారు 589 బిలియన్ డాలర్లు.

ఈ వరుస పరిణామాలపై ట్రంప్‌ స్పందించారు. డీప్‌సీక్ తక్కువ ఖర్చుతో తయారు చేసినట్లు తెలుస్తోంది. సిలికాన్‌ వ్యాలీకి ఇదొక వేకప్‌ కాల్‌ లాంటిది. డీప్‌సీక్‌కు వస్తున్న క్రేజ్‌ను సానుకూలంగా భావిస్తున్నట్లు చెప్పారు. బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చుతో అదే తరహా చాట్‌బాట్‌లను తయారు చేయొచ్చు’ అని అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement