ముఖేష్ అంబానీతో మార్కో రూబియో భేటీ.. ఇంధన రంగంపై చర్చలు | Marco Rubio meets Mukesh Ambani, discusses energy sector | Sakshi
Sakshi News home page

ముఖేష్ అంబానీతో మార్కో రూబియో భేటీ.. ఇంధన రంగంపై చర్చలు

Oct 21 2026 11:15 PM | Updated on Oct 21 2026 11:15 PM

Marco Rubio meets Mukesh Ambani, discusses energy sector

జామ్‌నగర్: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌ రిఫైనరీని సందర్శించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ,ఆయన తనయుడు అనంత్ అంబానీ వారికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీలోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమీకృత కార్యకలాపాలను అమెరికా ప్రతినిధులకు వివరించారు. అలాగే రిలయన్స్ ఏర్పాటు చేస్తున్న న్యూ ఎనర్జీ గిగా ఫ్యాక్టరీలు, నిర్మాణంలో ఉన్న డేటా సెంటర్ల గురించిన విషయాలను వారికి ముఖేష్ అంబానీ వివరించారు.

ప్రపంచ ఇంధన రంగంలో అవకాశాలు, సంప్రదాయ ఇంధనంతో పాటు పునరుత్పాదక ఇంధన రంగాల్లో వాణిజ్య భాగస్వామ్యాలు, సాంకేతిక అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. అమెరికా కంపెనీలతో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపైనా ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

తమ ఆహ్వానాన్ని మన్నించి జామ్‌నగర్‌ను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌కు రిలయన్స్ టీం కృతజ్ఞతలు తెలిపింది.

ఇదీ చదవండి: ఎస్‌ఈసీ కీలక నిర్ణ‌యం.. ఏపీలో స్ధానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement