ఎస్‌ఈసీ కీలక నిర్ణ‌యం.. ఏపీలో స్ధానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ | SEC key orders: Temporary break for municipal election process in AP | Sakshi
Sakshi News home page

ఎస్‌ఈసీ కీలక నిర్ణ‌యం.. ఏపీలో స్ధానిక ఎన్నికల ప్రక్రియకు బ్రేక్

Oct 21 2026 10:40 PM | Updated on Oct 21 2026 10:58 PM

SEC key orders: Temporary break for municipal election process in AP

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేష‌న్‌ ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రాష్ట్రంలోని 100 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అభ్యర్థుల జాబితాల ప్రకటనను నిలిపివేయాలని స్పష్టం చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాల‌ని భావించిన‌ప్ప‌టికి.. ఇప్పుడు మొత్తం 100 స్దానాల్లో నిలిపివేస్తున్న‌ట్లు ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.

మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాన్ని రేపు వెల్లడిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఈసీ రేపు తీసుకోబోయే నిర్ణయంపై రాజకీయ వర్గాలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కాగా ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో తలెత్తిన వివాదాలు, హింసాత్మక ఘటనలపై  ఎస్ఈసీకి సుప్రీంకోర్టు బుధవారం ఉద‌యం కీల‌క ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. హింస జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచడంతో పాటు ఈ నెల 25వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని  సుప్రీం కోర్టు  స్పష్టం చేసింది.


ఇదీ చదవండి: ఇరాన్‌తో యుద్ధం వద్దని ట్రంప్‌కు చెప్పిన కుమారుడు డాన్ జూనియర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement