చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్‌ మధ్య నుంచి దూసుకుపోయే రైలు..

china train runs through residential building - Sakshi

చైనా లోకల్‌ ఉత్పత్తులను భారత్‌లో విపరీతంగా ట్రోల్‌ చేస్తుంటారు. చాలామంది చైనా వస్తువులకు ఎటువంటి గ్యారెంటీ ఉండదంటూ హేళన చేస్తుంటారు. అయితే చైనా టెక్నాలజీ, అధునాతన ఉత్పత్తులు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తుంటాయి. టెక్నాలజీ పరంగా చైనా ఎంత వేగంగా దూసుకుపోతున్నదనే విషయాన్ని అవి తెలియజేస్తుంటాయి.  

అధునాతన రైళ్లు అనగానే ముందుగా చైనా, జపాన్‌ గుర్తుకువస్తాయి. ఈ దేశాల రైళ్ల వేగం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. చైనా రైల్వే టెక్నాలజీ మరో అద్భుతాన్ని చేసి చూపింది. తాజాగా చైనా19వ అంతస్థుల నివాసిత బిల్డింగ్‌ మధ్య నుంచి రైల్వే ట్రాక్‌ను రూపొందించింది. ప్రజలు ఉండే ఈ భవనం ఇప్పుడు రైల్వే స్టేషన్‌గానూ మారిపోయింది.

బిల్డింగ్‌ మధ్య నుంచి వెళ్లే రైలు
చైనా రైల్వే సిస్టం అద్భుతమైనది. ప్రపంచంలో ట్రాక్‌ లేకుండా రైలు నడిపిన ఘనత కూడా చైనాకే దక్కింది. హైస్పీడ్‌ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తూ ప్రయాణికులకు చైనా మరింత ఉత్తమ సేవలు అందిస్తోంది.  అందుకే కొందరు చైనా రైల్వే సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమని అంటుంటారు. తాజాగా చైనా ఒక బిల్డింగ్‌ మధ్య నుంచి రైల్వే ట్రాక్‌ నిర్మించింది. ఈ బిల్డింగ్‌ మధ్య నుంచి రోజూ రైళ్ల రాకపోకలు సాగుతుంటాయి. 19 అంతస్థుల ఈ బిల్డింగ్‌లోని 6వ, 8వ ఫ్లోర్‌లపై రైల్వే ట్రాక్‌ నిర్మించారు. భవనం మధ్య నుంచి ట్రాక్‌ నిర్మించడం ప్రపంచంలో ఇదే తొలిసారి. 

బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలుగకుండా..
చైనా ఈ రైల్వే ట్రాక్‌ నిర్మిస్తున్నప్పుడు ఈ మార్గంలో 19 అంతస్థుల బిల్డింగ్‌ అడ్డుగా నిలిచింది. అయితే రైల్వేశాఖ బిల్డింగ్‌ యజమానులను సంప్రదించి బిల్డింగ్‌ మధ్యగా ట్రాక్‌ వేసేందుకు అనుమతి పొందింది. అనంతరం బిల్డింగ్‌ మధ్య నుంచి ట్రాక్‌ వేశారు. ఇది ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ భవనంలో ఉంటున్నవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఈ ట్రాక్‌ రూపొందించారు.

ఈ ట్రాక్‌ వలన భవనంలో నివాసం ఉంటున్నవారికి మరో ప్రయోజనం కూడా చేకూరింది. వారికంటూ ఒక ప్రత్యేక రైల్వే స్టేషన్‌ ఏర్పడింది. దీంతో వారు ఇంటి నుంచి బయటకు వచ్చి, నేరుగా రైలులోనే కూర్చుని తదుపరి స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక రైలు నుంచి వచ్చే శబ్ధం బిల్డింగ్‌లోని వారికి ఇబ్బంది కలిగించకుండా ఉండేందుకు సైలెన్సింగ్‌ టెక్నిక్‌ వినియోగించారు.  
ఇది కూడా చదవండి: ఎన్నారై డాక్టర్ చేసిన తప్పేంటి? మెడికల్ లైసెన్స్ ఎందుకు లాక్కున్నారు?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top