జెఫ్రీ ఆర్చర్‌ కన్నుమూత | British Literary Icon Jeffrey Archer Dies at 86 | Sakshi
Sakshi News home page

జెఫ్రీ ఆర్చర్‌ కన్నుమూత

Oct 7 2026 4:51 AM | Updated on Oct 7 2026 4:51 AM

British Literary Icon Jeffrey Archer Dies at 86

యాభై ఏళ్లలో 59 నవళ్లు రాసిన రచయిత

లండన్‌: ప్రపంచ ప్రఖ్యాత బ్రిటిష్‌ రచయిత జెఫ్రీ ఆర్చర్‌ (86) సోమవారం లండన్‌లో కన్నుమూశారు. సోమవారం (భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజాము) తన నివాసంలో అకస్మాత్తుగా, ప్రశాంతంగా ఆయన మరణించినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌ కాలిన్స్‌ ప్రకటించింది. సుమారు యాభై ఏళ్ల పాటు తన రచన వ్యాసంగాన్ని కొనసాగించిన ఆర్చర్‌ రాజకీయ నాయకుడు కూడా. ఆర్చర్‌ రాసిన చివరి నవల ‘ఆడమ్‌ అండ్‌ ఈవ్‌‘ మంగళవారమే విడుదల కావడం యాదృచి్ఛకం.  జెఫ్రీ ఆర్చర్‌ రాజకీయ జీవితం మొత్తం వివాదాలతో కూడుకున్నదే.

అబద్ధపు ప్రమాణం చేసిన ఆరోపణలపై దోషిగా తేలడంతో ఆయన కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించారు. అయితే రచయితగా మాత్రం ఎన్నో రికార్డులు ఈయన సొంతం. ఆర్చర్‌ రాసిన నవళ్లు సుమారు 30 కోట్ల కాపీలు అమ్ముడుపోయినట్లు అంచనా. అంతేకాదు... వీటిని 47 భాషల్లోకి అనువదించారంటే ఆయన పాపులారిటీ ఏమిటన్నది ఇట్టే అర్థమైపోతుంది. ఆర్చర్‌ పుస్తకాలు బ్రిటన్‌లోని సండే టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌ జాబితాలో 14 ఏళ్ల ఐదు నెలల పాటు, న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌ జాబితాలో ఐదేళ్లకు పైగా నిలిచినట్లు హార్పర్‌ కాలిన్స్‌ తెలిపింది.

కొన్ని పెట్టుబడులతో ఆర్థికంగా భారీగా నష్టపోయిన నేపథ్యంలో ఆర్చర్‌...1976లో ‘నాట్‌ ఎ పెన్నీ మోర్, నాట్‌ ఎ పెన్నీ లెస్‌‘ ద్వారా రచయితగా అరంగేట్రం చేశారు. దివాలా అంచుల్లోంచి బయటపడ్డ తన సొంత అనుభవం స్ఫూర్తితో ఈ పుస్తకం రాసినట్టుగా చెబుతారు. 1987లో ఆర్చర్‌ ఒక కేసులో కోర్టులో ప్రమాణం చేసి అబద్ధం ఆడారన్న ఆరోపణ రుజువైంది. దీంతో ఆయనకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే రెండేళ్ల జైలు శిక్ష తరువాత 2023లో ఆర్చర్‌ విడుదలయ్యారు. జైలు జీవితాన్ని ఆర్చర్‌ ‘ఎ ప్రిజన్‌ డైరీ‘ అనే మూడు సంపుటాల సిరీస్‌లో వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement