పెళ్లిలో తాగొచ్చిన వరుడు.. మాజీ ప్రియుడితో వధువు పరార్‌.. | Bride Ditches Her Drunk Husband, Runs Away With Her Cousin On Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లిలో తాగొచ్చిన వరుడు.. మాజీ ప్రియుడితో వధువు పరార్‌..

Sep 22 2021 5:48 PM | Updated on Sep 22 2021 6:42 PM

Bride Ditches Her Drunk Husband,  Runs Away With Her Cousin On Wedding - Sakshi

పెళ్లి అన్యోన్య దాంపత్య జీవితానికి పునాది. రెండు మనసులతో పాటు రెండు కుటుంబాలను కలిపే వేడుక. సంప్రదాయ బద్ధంగా జరిగే ఈ శుభకార్యానికి పెళ్లి కొడుకు తప్పతాగి వచ్చాడు. ఇంకేముంది పెళ్లిమండపంలోనే వరుడిని వదిలేసిన వధువు తన మాజీ ప్రియుడితో పారిపోయింది. ఈ  ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఈ ఘటన గతేడాది జరగ్గా.. తాజాగా వైరలవుతోంది. మేరీల్యాండ్‌కు చెందిన 24 ఏళ్ల సేరియా సామ్‌ అనే వ్యక్తి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. దీంతో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే పెళ్లికి బంధువులు ఎవరూ రాకపోవడంతో తన కజిన్‌(మాజీ ప్రియుడు) కైల్‌ను ఆహ్వానించింది.
చదవండి: చీర కట్టుకొని వస్తే ఎలా? రెస్టారెంట్‌కు వెళ్లిన మహిళకు అవమానం

పెళ్లి అనే ఆనందంలో పెళ్లికొడుకు తాగి వచ్చాడు. అటూ ఇటూ తూలుతున్నాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తనకే తెలియకుండా ప్రవర్తించాడు. ఇదంతా వధువు గుర్తించింది. ‘వరుడు నా ముఖంలోకి సరిగా చూడలేకపోయాడు. పెళ్లి ఉంగరాలను కూడా కింద పడేశాడు.’అని ఆమె వాపోయింది. చివరికి విచిత్రకర పరిస్థితుల్లో ఆమె పెళ్లి జరిగింది. కానీ వధువు అతని చర్యలపై విసుగు చెందింది.
చదవండి: ఐకానిక్ మహాభారత్ సాంగ్‌ను ఆలపించిన ముస్లిం: నెటిజన్లు ఫిదా!

వరుడు కళ్లు తెరవలేకపోతున్నాడని, సరిగా నిల్చోలేకపోతున్నాడని తన మాజీ ప్రియుడితో చెప్పుకొని వాపోయింది. ఆమె బాధను చూసిన ఆ వ్యక్తి.. ‘వరుడు నీకు సరైన వాడు కాదు. అతను మూర్ఖుడు. అతనిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇదంతా నేను చూడలేను. అందరూ నిన్ను హెచ్చరించారు. అయినా నువ్వు వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో’ అంటూ వధువుపై తనకున్న ఫీలింగ్స్‌ను చెప్పి తనతో వచ్చేందుకు సిద్ధమేనా అని అడిగాడు. దీంతో వధువు ఆలోచించి తన బాయ్‌ఫ్రెండ్‌తో పరారైంది. కారు పార్కింగ్‌ వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్తున్న ఈ జంట ఒకరినొకరు కిస్‌ చేసుకుంటూ కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement