మహాభారత్‌ టైటిల్ సాంగ్‌తో ఆకట్టుకుంటున్న ముస్లిం: వీడియో వైరల్‌

Iconic Mahabharat title track by Muslim man wins Internet viral video - Sakshi

పాపులర్‌   సీరియల్‌  మహాభారత్‌ సాంగ్‌ను అద్భుతంగా ఆలపించిన ముస్లిం: వీడియో వైరల్‌

సాక్షి, హైదరాబాద్‌: అలనాటి పాపులర్‌ టెలివిజన్‌ సీరియల్‌ ‘మహాభారత్‌’ టైటిట్‌ సాంగ్‌ను ఆసాంతం అద్భుతంగా  ఆలపించి ఒక ముస్లిం ప్రశంసలందుకుంటున్నారు.  ఆయన స్వరానికి, స్పష్టమైన ఉచ్చారణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ ఐకానిక్ ట్రాక్‌ను హృద్యంగా ఆలపించిన  ఈ వీడియోను మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్‌వై  ఖురైషి షేర్ చేశారు.  బీటింగ్‌ ది స్టీరియోటైప్స్  అంటూ ఆయన షేర్‌ చేసిన ఈ  వీడియో ప్రస్తుతం  సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

హిందూ ఇతిహాసాల ఆధారంగా రూపొందించిన రామాయణ, మహాభారత సీరియల్స్  టెలివిజన్‌ చరిత్రలో  గొప్ప సంచలనం రేపాయి.  ఆదివారం  ఉదయం  ప్రసారమయ్యే వీటి కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేశారు. తాజా వీడియోతో ఈ ఐకానిక్‌ టైటిల్‌ సాంగ్‌ వినపడగానే అందరూ టెలివిజన్‌ సెట్ల ముందుకు చేరిపోయే వైనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  నిమిషం, 9 సెకన్ల నిడివి గల ఈ వీడియో నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దిస్‌ ఈజ్‌  ఇండియా అంటూ కమెంట్‌ చేస్తున్నారు. లక్షా12 వేలకు పైగా  వ్యూస్‌, రీట్వీట్లు,  లైక్స్‌తో ఈ వీడియో సందడి చేస్తోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top