ఢాకా: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత బంగ్లాదేశ్ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పాలక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) నేత మిర్జా ఫఖ్రూల్ ఇస్లాం ఆలంగీర్ విజయం సాధించారు. మిర్జా ఫఖ్రూల్ బీఎన్‌పీకి దీర్ఘకాలంగా ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. గురువారం ఢాకాలోని పార్లమెంట్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 74 ఏళ్ల ఫఖ్రూల్‌కు 255 ఓట్లు పడ్డాయి.
జమాతే ఇస్లామా సారథ్యంలోని 11 విపక్ష పార్టీల కూటమి అభ్యర్థి, లిబరల్ డెమొక్రటిక్ పార్టీ చైర్మన్ రిటైర్డ్ కల్నల్ ఓలీ అహ్మద్‌కు 88 ఓట్లు పడ్డాయి. పార్లమెంట్‌లో 349 మంది తమ ఓటును నమోదుచేసుకోగా గురువారం 343 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆరుగురు ఓటేయలేదు. గెలచిన ఫఖ్రూల్ శుక్రవారం బంగభవన్‌లోని దర్బార్ హాల్‌లో దేశాధ్యక్షునిగా ప్రమాణంచేయనున్నారు. 1991 తర్వాత బంగ్లాదేశ్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు ఆప్తుడైన మొహమ్మెద్ షాహబుద్దీన్ అనారోగ్య కారణాలను చూపుతూ హఠాత్తుగా అధ్యక్ష పదవికి నుంచి దిగిపోవడం తెల్సిందే.


