స్టార్మర్‌కు బర్న్‌హామ్‌ ముప్పు  | Andy Burnham bolsters leadership credentials with strong win | Sakshi
Sakshi News home page

స్టార్మర్‌కు బర్న్‌హామ్‌ ముప్పు 

Jun 20 2026 5:31 AM | Updated on Jun 20 2026 5:31 AM

Andy Burnham bolsters leadership credentials with strong win

పార్లమెంట్‌ సీటును గెల్చుకున్న మాంఛెస్టర్‌ మేయర్‌ 

కీలక కేబినెట్‌ పోస్టుకు నో చెప్పిన లేబర్‌ పార్టీ నేత  

నాయకత్వ పోరులో తగ్గేదేలేదంటున్న ప్రధాని 

లండన్‌: అధికార లేబర్‌ పార్టీలో అసమ్మతిని చల్లార్చేందుకు ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న యూకే ప్రధాని కీర్‌ స్టార్మర్‌కు మరో కొత్త బెడద వచ్చి పడింది. ఆయనే గ్రేటర్‌ మాంఛెస్టర్‌ మేయర్‌ ఆండీ బర్న్‌హామ్‌(56). స్టార్మర్‌ ప్రభుత్వ విధానాలను విమర్శించే అసమ్మతి లేబర్‌ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. అయితే, ఎంపీ కాకపోవడంతో ఆయన విమర్శల ప్రభావం స్టార్మర్‌పై పరోక్షంగా ఉండేది. అయితే, వాయవ్య ఇంగ్లండ్‌లోని మేకర్‌ ఫీల్డ్‌ పార్లమెంట్‌ స్థానానికి తాజాగా జరిగిన ఎన్నికలో బర్న్‌హామ్‌ ఘన విజయం సాధించారు. 

రిఫామ్‌ యూకే పార్టీకి చెందిన రాబ్‌ కెన్యన్‌పై 9 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఎంపీగా గెలవడంతో ఇప్పుడు ప్రత్యక్షంగా స్టార్మర్‌ను ఢీకొనే స్థాయికి ఆయన ఎదిగారు. అసమ్మతిదారుల తరఫున ఆయన గళం బలంగా వినిపించే అవకాశముంది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని 650 మంది సభ్యులకు గాను లేబర్‌ పార్టీకి 400పైచిలుకు సభ్యులున్నారు. లేబర్‌ పార్టీ ఎంపీల్లో ఒకరిగా తాను ఉండదల్చుకోలేదని ఎన్నికల ఫలితాల తర్వాత బర్న్‌హమ్‌ స్పష్టం ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపించారు. బర్న్‌హామ్‌కు స్టార్మర్‌ అభినందనలు తెలిపారు. అదే సమయంలో, ప్రధాని పీఠం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని, పోరాటం నుంచి తప్పుకోబోనంటూ స్పష్టం చేశారు. అయితే, ప్రధాని స్టార్మర్‌ ఆఫర్‌ను స్వీకరించేందుకు బర్న్‌హామ్‌ సిద్ధంగా లేరని చెబుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement