breaking news
Greater Manchester
-
పరిశోధకుడి నుంచి ప్రధాని రేస్ దాకా
లండన్: ప్రధాని పీఠం నుంచి స్టార్మర్ తప్పుకోవడంతో తదుపరి ప్రధాని పోరు మొదలైంది. ఈ పోటీలో గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ ఆండీ ముర్రే బర్న్‌హామ్ ముందంజలో ఉన్నారని బ్రిటన్ మీడియా కోడై కూస్తోంది. ప్రజలే స్వయంగా ‘కింగ్ ఆఫ్ ది నార్త్’కిరీటాన్ని తలపై పెట్టడంతో ఆండీ గురించి చర్చ ఆరంభమైంది. పరిశోధకునిగా తన కెరీర్‌ను మొదలెట్టి తర్వాత కేబినెట్ మంత్రిగా కొన్నేళ్లు పనిచేశారు. 1970 జనవరి ఏడున ల్యాంక్షైర్లోని మెర్సీసైడ్‌లో జన్మించారు. బర్న్మామ్ తండ్రి టెలిఫోన్ ఇంజనీర్కాగా తల్లి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్. బర్న్‌హామ్ గతంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్య సించారు. 15 ఏళ్ల వయసులోనే లేబర్ పార్టీలో చేరారు. పార్లమెంట్ సభ్యురాలు టెసా జోవెల్ వద్ద పరిశోధకునిగా పనిచేశారు. తర్వాత 1995లో బ్రిటన్‌లో పెద్ద కార్మిక సంఘాల్లో ఒకటైన ట్రాన్స్పోర్ట్ అండ్ జనరల్ వర్కర్స్ యూనియన్‌లో సేవలందించారు. నేషనల్ హెల్త్ సర్వీస్ కాన్ఫెడరేషన్కు పార్లమెంటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. తర్వాత సంస్కృతి, మీడియా, క్రీడల శాఖకు ప్రత్యేక సలహాదారుగా సేవలందించారు. 2001లో లీగ్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. గోర్డెన్ బ్రౌన్ హయాంలో ఆర్థిక శాఖలో పనిచేశారు. తర్వాత సాంస్కృతిక శాఖ మంత్రిగా, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 2015, 2017లో రెండు సార్లు పార్టీ అగ్రనాయకత్వ పదవికి కోసం పోటీపడి విఫలమయ్యారు. తర్వాత 2019లో గ్రేటర్ మాంచెస్టర్ మేయర్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించారు. తర్వాతి ఎన్నికల్లోనూ గెలిచారు. కన్జర్టేటివ్ ప్రభుత్వ హయాంలో కోవిడ్ సంక్షోభసమయంలో ప్రభుత్వతీరును ఎండగట్టారరు. లండన్, ఆగ్నేయ ప్రాంతాలతో పోలిస్తే మాంచెస్టర్ వంటి ఉత్తర ఇంగ్లండ్ ప్రాంతాలకు నిధులు కేటాయింపులు సరిగా లేవని ఉద్యమించారు. దీంతో జాతీయస్థాయిలో ఈయన పేరు మార్మోగిపోయింది. -
స్టార్మర్‌కు బర్న్‌హామ్ ముప్పు
లండన్: అధికార లేబర్ పార్టీలో అసమ్మతిని చల్లార్చేందుకు ఇప్పటికే అష్టకష్టాలు పడుతున్న యూకే ప్రధాని కీర్ స్టార్మర్‌కు మరో కొత్త బెడద వచ్చి పడింది. ఆయనే గ్రేటర్ మాంఛెస్టర్ మేయర్ ఆండీ బర్న్‌హామ్(56). స్టార్మర్ ప్రభుత్వ విధానాలను విమర్శించే అసమ్మతి లేబర్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. అయితే, ఎంపీ కాకపోవడంతో ఆయన విమర్శల ప్రభావం స్టార్మర్‌పై పరోక్షంగా ఉండేది. అయితే, వాయవ్య ఇంగ్లండ్‌లోని మేకర్ ఫీల్డ్ పార్లమెంట్ స్థానానికి తాజాగా జరిగిన ఎన్నికలో బర్న్‌హామ్ ఘన విజయం సాధించారు. రిఫామ్ యూకే పార్టీకి చెందిన రాబ్ కెన్యన్పై 9 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. ఎంపీగా గెలవడంతో ఇప్పుడు ప్రత్యక్షంగా స్టార్మర్ను ఢీకొనే స్థాయికి ఆయన ఎదిగారు. అసమ్మతిదారుల తరఫున ఆయన గళం బలంగా వినిపించే అవకాశముంది. హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 650 మంది సభ్యులకు గాను లేబర్ పార్టీకి 400పైచిలుకు సభ్యులున్నారు. లేబర్ పార్టీ ఎంపీల్లో ఒకరిగా తాను ఉండదల్చుకోలేదని ఎన్నికల ఫలితాల తర్వాత బర్న్‌హమ్ స్పష్టం ప్రకటించారు. దేశానికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపించారు. బర్న్‌హామ్‌కు స్టార్మర్ అభినందనలు తెలిపారు. అదే సమయంలో, ప్రధాని పీఠం నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని, పోరాటం నుంచి తప్పుకోబోనంటూ స్పష్టం చేశారు. అయితే, ప్రధాని స్టార్మర్ ఆఫర్‌ను స్వీకరించేందుకు బర్న్‌హామ్ సిద్ధంగా లేరని చెబుతున్నారు. -
Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కారు మీదకు దూసుకొచ్చినా..
ఓ ఎర్రకారు మాంచెస్టర్ వీధులలో బీభత్సం సృష్టించింది. మారియన్ స్మిత్(79) అనే వృద్ధుడు తప్పతాగి డ్రైవింగ్ చేశాడు. ఓ బాలుడి పైనుంచి కారు దూసుకెళ్లినా బాబు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రేటర్ మాంచెస్టర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ బాలుడు లేచిన వెంటనే తనకు నచ్చిన స్వీట్లను తీసుకుని తింటూ అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. భార్యాభర్తలు, వారి ఆరు సంవత్సరాల బాబు ఓ మార్కెట్ స్టోర్ కి వెళ్లారు. పేరేంట్స్ ఇంటికి కావలసిన వస్తువులు ఖరీదు చేస్తుండగా, బాబు మాత్రం తనకు ఇష్టమైన స్వీట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అయితే అప్పటికే తప్పతాగిన మారియన్ స్మిత్ తన కారును ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇక అంతే తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చిన స్టోర్ లోకి దూసుకొచ్చిన ఎరుపు రంగు కారు బాలుడిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటన చూస్తున్న బాలుడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు. తమ కుమారుడికి ఏమైందోనని కంగారు పడి పరుగున వచ్చి, బాలుడ్ని పైకి లేపారు. అదృష్టవశాత్తూ బాబు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. కారు కింద పడి మృత్యువు నుంచి తప్పించుకున్న బాలుడు.. స్టోర్‌లో ఉన్న వారికి తాను కూడా షాక్ ఇచ్చాడు. ప్రమాదం నుంచి బయటపడ్డ తర్వాత కూడా వెంటనే తనకు ఇష్టమైన స్వీట్లు తీసుకుని తింటూ అక్కడున్న వారిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో స్టోర్ కాస్త ధ్వంసమైంది. బాలుడు నిజంగానే అదృష్టవంతుడని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసు జాన్ బ్రెన్నన్ చెప్పాడు. తప్పతాగి డ్రైవింగ్ చేసిన స్మిత్ కు మూడేళ్లపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారని తెలిపాడు.


