పీవోకేలో మళ్లీ కాల్పులు.. 16 మంది మృతి | 16 killed, over 30 injured as Pakistani forces open fire on protesters in POK | Sakshi
Sakshi News home page

పీవోకేలో మళ్లీ కాల్పులు.. 16 మంది మృతి

Jun 12 2026 5:36 AM | Updated on Jun 12 2026 5:36 AM

16 killed, over 30 injured as Pakistani forces open fire on protesters in POK

రావల్‌కోట్‌: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) లో నిరాయుధులైన ఆందోళనకారులపై భ ద్రతా బలాలు మరోసారి తుపాకులు ఎక్కు వపెట్టాయి. గురువారం జరిగిన కాల్పుల్లో 16 మంది చనిపోగా, 37 మంది గాయాల పాలయ్యారు. పెరుగుతున్న ధర లను నిరసి స్తూ సుమారు 70 వేల మంది రావల్‌కోట్‌ లోని ఈద్గా మైదానంలో జరి గిన ర్యాలీకి తరలివచ్చారు. పాక్‌ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. 

తక్కువ ధరలకే నిత్యావసరల వస్తువులను పంపిణీ చేయాలని, విద్యుత్‌ చార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం నిరసనకా రులపై జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పో యిన 30 మందికి, క్షతగాత్రులుగా మారిన మరో 200 మందికి న్యాయం చేయాలని వారు గర్జించారు. బందోబస్తు విధుల్లో ఉన్న పాకిస్తాన్‌ ఆర్మీ వారిపైకి యథేచ్ఛగా కాల్పు లు జరిపింది. దీంతో, జనం భయభ్రాంతు లకు గురై పరుగులు తీశారు. కాల్పులపర్వం అనంతరం ఈద్గా మైదానం రక్తమోడగా, రోడ్లనిండా రక్తపు మరకలే కనిపించాయి.

సైనిక హెలికాప్టర్‌ కూలి 22 మంది మృతి: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ సమీపంలో బుధవారం ఎంఐ–17 రకం ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ముగ్గురు అధికారులు సహా 22 మంది సైనికులు చనిపోయారు. సాంకేతిక లోపం తలె త్తడంతోనే ఈ ప్రమాదం చోటుచేసు కున్నట్లు ఆర్మీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement