ప్రాణాలు తీసిన ఓవర్‌టేక్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన ఓవర్‌టేక్‌

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

ముందువెళ్తున్న లారీని ఢీకొన్న బైక్‌

ఇద్దరు యువకుల మృత్యువాత

సనత్‌నగర్‌: ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ముందు వెళ్తున్న లారీని బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సనత్‌నగర్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా కోడూరుకు చెందిన సందీప్‌ (26) నగరంలోని మహేంద్రహిల్స్‌లో, ఇతని స్నేహితుడు కామారెడ్డికి చెందిన ధాత్రిక సాయి కౌశిక్‌ (24) రామంతాపూర్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ ప్రైవేట్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సికింద్రాబాద్‌లో స్నేహితురాలి పుట్టినరోజు వేడుకలకు కోసం బైక్‌పై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తున్నారు. కౌశిక్‌ బైక్‌ నడుపుతుండగా సందీప్‌ వెనక కూర్చున్నాడు. భరత్‌నగర్‌ వద్ద బ్రిడ్జి దిగే క్రమంలో ముందు వెళ్తున్న లారీలను అతివేగంగా ఓవర్‌ టేక్‌ చేయబోవడంతో ప్రమాదం జరిగింది. లారీని ఢీకొనడంతో బైక్‌తో సహా ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. తలలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సందీప్‌

కౌశిక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement