రౌడీషీటర్ హత్య కేసు.. ముగ్గురి రిమాండ్
జీడిమెట్ల: ఓ రౌడీషీటర్ అనుమానంతో మరో రౌడీషటర్‌ను హత్య చేసిన సంఘట నలో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంచార్జ్ డీసీపి కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. జగద్గిరిగుట్టకు చెందిన బాలశౌరెడ్డి(22)పై జగద్గిరిగుట్టలో రౌడీషీట్, ఐడీపీఎల్ ప్రాంతంలో నివసించే రోషన్‌కుమార్‌సింగ్(25)పై బాలానగర్ పీఎస్‌లో రౌడీషీట్ ఉంది. రోషన్‌కు సంబందించిన విషయాలను బాలశౌరెడ్డి పోలీసులకు సమాచారం అందిస్తున్నాడ ని రోషన్ బాలశౌరెడ్డిపై అనుమానం పెంచుకున్నాడు. అదేవిదంగా ఒకానొక దశలో బాలశౌరెడ్డిని హత్య చేయాలని రోషన్ బావించాడని బాలశౌరెడ్డికి తెలిసింది.
తనను చంపుతాడెమో అనుకుని..
రోషన్ ఒకవేళ తనను చంపుతాడెమోనని బాలశౌరెడ్డి అనుకున్నాడు. ఎలాగైనా రోషన్‌ను హత్య చేయాలని అనుకున్న బాలశౌరెడ్డి పఽథకం ప్రకారం ఇన్‌స్టా ద్వారా రోషన్‌ను బుధవారం సాయంత్రం 4గంటలకు జగద్గిరిగుట్ట బస్‌స్టాప్ వద్దకు రప్పించాడు. అదే సమయంలో బాలశౌరెడ్డి అతని మరో ఇద్దరు స్నేహితులైన సయ్యద్ మహ్మద్(23), రేవ అదిత్య(22)లతో కలిసి బుల్లెట్‌పై బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. బస్టాప్ వద్ద ఉన్న రోషన్‌ను గమనించిన బాలశౌరెడ్డి, అతని స్నేహితుడు సయ్యద్ మహ్మద్‌తో కలిసి రోషన్ వద్దకు వెళ్లారు. వెంటనే సయ్యద్ మహ్మద్ రోషన్‌ను పట్టుకోగా బాలశౌరి రోషన్‌ను కత్తితో విచక్షణరహితంగా చాతి, కడుపు బాగాల్లో ఆరుపోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలైన రోషన్ అక్కడ నుండి తప్పించుకుని పరుగులు తీయగా బాలశౌరెడ్డి, సయ్యద్ మహ్మద్, అదిత్య బుల్లెట్‌పై ఎక్కి అక్కడ నుండి పరారయ్యారు.
చికిత్సపొందుతూ మృతిచెందిన రోషన్..
విషయం తెలుసుకున్న పోలీసులు తీవ్రగాయాలపాలైన రోషన్‌కు ప్రథమ చికిత్సం చేయించి గాంధీ అస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో రోషన్ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. రోషన్ స్నేహితుడు మనోహర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితులు ముగ్గురుని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి గురువారం రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎస్‌ఓటి డీసీపీ శోభన్‌కుమార్, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్, బాలానగర్ ఏసీపీ నరేష్‌రెడ్డి, జగద్గిరిగుట్ట ఇన్స్‌పెక్టర్ వెంకటేష్, బాలానగర్ ఏస్‌వోటి ఇన్స్‌పెక్టర్ శివ పాల్గొన్నారు.
బాధితుడు, నిందితుడు ఇద్దరూ రౌడీషీటర్లే


