అధిక మోతాదులో డ్రగ్స్‌తీసుకొని యువకుడు మృతి
రాజేంద్రనగర్: అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడంతో ఓ యువకుడు మృతి చెందాడు. రాజేంద్రనగర్ పోలీసులు తెలిపిన మేరకు.. శివరాంపల్లి కేన్ హుడ్ అపార్ట్‌మెంట్ ఫస్ట్ టవర్స్‌లో సయ్యద్ (28), మమతా బిశ్వాస్ (26), ధారా (26), మహ్మద్ అహ్మద్ (26)లు నివాసముంటున్నారు. పాతబస్తీ జహనుమా ప్రాంతానికి చెందిన మహ్మద్ అహ్మద్ ధారాతో కలిసి సహజీవనం చేస్తున్నారు. వీరి రూమ్ పక్కనే మమతా బిశ్వాస్, సయ్యద్ నివసిస్తున్నారు. మహ్మద్ అహ్మద్ బుధవారం రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. అనంతరం మహ్మద్ అహ్మద్‌తో పాటు ధారా, సయ్యద్‌లు డ్రగ్స్‌ను సేవించారు. అహ్మద్ ఓవర్ డోస్ తీసుకోవడంతో ముక్కు నుండి రక్తం వచ్చింది. దీంతో సయ్యద్ అపార్ట్‌మెంట్‌లోని డాక్టర్‌ను తీసుకొచ్చి చూపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పంచమానా నిర్వహించి మృతదేహన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ధారా, సయ్యద్‌లు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. మమతా బిశ్వాస్‌కు నెగిటివ్ వచ్చింది. మహ్మద్ అహ్మద్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చాడు?ఎన్ని రోజుల నుంచి వినియోగిస్తున్నాడు?ఇంకా ఎవరైనా ఇదే రూమ్‌లో డ్రగ్స్ తీసుకున్నారా ? వీరందరిపై మధ్య సంబంధం ఏమిటని పోలీసులు విచారిస్తున్నారు.


