స్టేటస్ పెట్టి విద్యార్థి ఆత్మహత్యాయత్నం
– రక్షించిన కాచిగూడ పోలీసులు
కాచిగూడ: రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు యత్నించిన ఓ విద్యార్థిని కాచిగూడ పోలీసులు సకాలంలో స్పందించి రక్షించారు. అడ్మిన్ ఎస్‌ఐ నరేష్ తెలిపిన మేరకు.. నాగోల్ ప్రాంతానికి చెందిన లకన్ కుమార్ (21) హబ్సిగూడలోని ఓమేగా కాలేజ్‌లో బీసీఏ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు గురువారం వాట్సప్ స్టేటస్‌లో వీడియో పెట్టాడు. గమనించిన స్నేహితురాలు ఉమ ఫోన్ ద్వారా 100కు కాల్ చేసి చెప్పింది. వారు కాచిగూడ పోలీసులను, రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు. కాచిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. కాచిగూడ లోని ఖాజా గరీబ్‌నగర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జివద్ద అతడిని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న అతన్ని పోలీసులు రక్షించి వెంటనే కాచిగూడ లోని సీసీ ష్రాఫ్ ఆసుపత్రికి తరలించారు.


