నగరంలో భారీ వర్షం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఆదివారం రాత్రి వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సెలవురోజు కావడంతో బయటికి వచ్చిన నగర వాసులను తీవ్ర అవస్థలకు గురిచేసింది. రాత్రి 8 గంటల వరకు 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కాగా, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, బోరబండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, ముషీరాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
బేగంపేట్‌లో..


