రామలింగేశ్వరుడి సేవలో శృంగేరి పీఠాధిపతి
కీసర: దక్షిణామ్మాయ శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీవిధుశేఖర భారతి మహాస్వామి ఆదివారం కీసరగుట్ట శ్రీరామలింగేశ్వర స్వామి సేవలో పాల్గొన్నారు. ధర్మ విజయ యాత్రలో భాగంగా కీసరగుట్ట సందర్శనకు విచ్చేసిన శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారికి ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈఓ కట్ట శేఖర్‌రెడ్డి, అర్చకులతో కలిసి పూర్ణకుంభ స్వాగతం ఫలికారు. మహాస్వామి శ్రీ రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం, శ్రీ భవానీ శివదుర్గా అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థానం పున: నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి పరిశీలించారు. ఈ క్షేత్రంతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. బాల్యంలో మహాశివరాత్రి పర్వదినాలలో వైదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారికి అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం శ్రీ విధుశేఖర భారతి మహాభారతి మహాస్వామి శ్రీ అన్నపూర్ణా బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రాన్ని, తాను బాల్యంలో వేద విద్యను అభ్యసించిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాలను సందర్శించారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
