
సెకండ్ హ్యాండ్ కార్లలో లిక్కర్ దందా
హస్తినాపురం: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ముసుగులో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యాన్ని తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ముఠాకు ఎస్‌టీఎఫ్ పోలీసులు చెక్ పెట్టారు. వారి నుంచి రూ. 4 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన కత్రావత్ రవీందర్ సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవాడు. ఇందుకు గాను తరచూ ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లేవాడు. ఆయా ప్రాంతాల్లో కార్లను కొనుగోలు చేసే అతను అక్కడ తక్కువ ధర ఉన్న మద్యాన్ని కొనుగోలు చేసి కారు డిక్కీలో వేసుకుని నగరానికి తీసుకువచ్చేవాడు. ఈ మద్యం బాటిళ్లను హస్తినాపురం సంతోషిమాత కాలనీలో ఉంటున్న తన మిత్రుడు నాగిరెడ్డికి అందజేసేవాడు. అతను వాటిని విక్రయించగా వచ్చి వచ్చిన లాభాలను ఇద్దరూ పంచుకునేవాడు. దీనిపై సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్ పోలీసులు సీఐ నాగరాజు నేతృత్వంలో బుధవారం రాత్రి నాగిరెడ్డి ఇంటిపై దాడిచేశారు. ఈ సందర్భంగా డిల్లీ నుంచి తెచ్చిన 105 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ.4 లక్షలు ఉండవచ్చునని సీఐ తెలిపారు. మద్యం బాటిళ్లను పట్టుకున్న ఎస్‌టీఎఫ్ టీఎంను ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ షాన్‌వాజ్‌ఖాసీం అభినందించారు.
దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న
ముఠా అరెస్టు
అంబర్‌పేట: దృష్టి చోరీలకు పాల్పడుతున్న ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల ముఠాను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. డీఐ హఫీజుద్దీన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మోఘల్‌పురా సుల్తాన్‌షాహికి చెందిన సయ్యద్ ఆఫ్రీదిన్, షేక్ హమీదుద్దీన్, నసీమ్ బేగం, ఖయ్యూం సుల్తానా ముఠాగా ఏర్పడి దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నెల 5న వారు అంబర్‌పేట తిరుమల నగర్‌లోని భవానీలాల్ జ్యూవెల్లరీ దుకాణానికి వచ్చారు. వృద్ధురాలైన ఖయ్యూం సూల్తానా తన ఒంటిపై ఉన్న బంగారు గాజులను తీసి ఇచ్చి వాటిపై డబ్బులు కావాలని కోరింది. వాటికి రూ.2 లక్షలు వస్తాయని చెప్పిన దుకాణ యజమాని డబ్బులు ఇచ్చేందుకు సిద్దపడి కౌంటర్‌లో నుంచి తీసి బయటపెట్టారు. బంగారాన్ని పరీక్షించేందుకు అతను లోపలి వెళ్లగానే వారు కౌంటర్ పై ఉన్న రూ.2 లక్షల నగదును తీసుకుని ఉడాయించారు. అదే సమయంలో బంగారాన్ని పరీక్షించిన యజమానికి అది నకిలీదిగా గుర్తించి బయటికి చూడగా సుల్తానాతో పాటు మిగతా వ్యక్తులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
● ఢిల్లీ నుంచి మద్యం అక్రమ రవాణా
● రూ. 4 లక్షల విలువైన నాన్‌డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత

సెకండ్ హ్యాండ్ కార్లలో లిక్కర్ దందా