
ఒప్పందం కుదిరేనా!
జపాన్ రవాణా సదుపాయాలపై అధ్యయనం..
ఈ పర్యటనలో భాగంగా జపాన్‌లోని వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో వినియోగంలో ఉన్న ప్రజారవాణా సదుపాయాలను కూడా ముఖ్యమంత్రి బృందం అధ్యయనం చేయనుంది. జపాన్‌లోని కోబ్, క్యోటో, నగోయా, ఒసాకా, సప్పోరో, సెండాయ్, టోక్యో, యొకోహామా తదితర నగరాల్లో సబ్‌వే వ్యవస్థలు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా మెట్రోపాలిటన్ ప్రాంతాలను క్రాస్ చేసే సబర్బన్ కమ్యూటర్ రైల్వే సదుపాయం అక్కడ ఉంది. అలాగే అనేక నగరాల్లో స్ట్రీట్‌కార్, మోనోరైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అర్బన్ ర్యాపిడ్ రైల్ సిస్టమ్, ఆటోమేటెడ్ గైడ్‌వే ట్రాన్సిట్ (ఏజీటీ), ఆటోమేటెడ్ పీపుల్ మూవర్, (ఏపీఎం), లైట్‌రైల్ ట్రాన్సిట్ (ఎల్‌ఆర్‌టీ), ట్రామ్, సిటీబస్ వంటి వివిధ రకాల ప్రజారవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో మెట్రో రైల్ విస్తరణతో పాటు అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్‌కు అనుగుణమైన ప్రజారవాణా సదుపాయాలపై ఈ అధ్యయనంలో దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో రెండోదశ నిర్మాణానికి నిధుల సమీకరణకు రాష్ట్ర సర్కారు జైకా (జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ)తో సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో భాగంగా ఆ సంస్థతో రుణ అంశంపై చర్చించేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నుంచి జపాన్‌లో పర్యటిస్తున్నందున.. ఇదే సమయంలో జైకాతో సమావేశం నిర్వహించేలా షెడ్యూల్ ఖరారైంది. ఈ సమావేశంలో నిధుల విడుదల వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది. మెట్రో రెండో దశ నిర్మాణానికి నిధులు అందజేసేందుకు జైకా సూత్రప్రాయంగా అంగీకరించింది. తాజాగా సీఎం జపాన్ పర్యటనలో భాగంగా మరోసారి జైకా ప్రతినిధుల బృందంతో సమావేశమై నిధుల విడుదలపై పరస్పర ఒప్పందం కుదు ర్చుకునే అవకాశం ఉన్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. తద్వారా మెట్రో రెండో దశకు నిధులను అందజేసేందుకు జైకా సిద్ధంగా ఉన్న దృష్ట్యా కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభించేందుకు ఒత్తిడి చేసేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
నిధుల సేకరణంలో భాగంగా..
మెట్రో రెండో దశలో మొదట ప్రతిపాదించిన 5 కారిడార్‌లలో 76.4 కిలోమీటర్ల మెట్రో నిర్మాణానికి సుమారు రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ఇందులో ప్రైవేట్ సంస్థల నుంచి 52 శాతం నిధులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకు న్నారు. అంటే.. సుమారు రూ.12,726 కోట్లు జైకా వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవా ల్సి ఉంటుంది. మిగతా వ్యయంలో 30 శాతం నిధులు అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. మరో 18 శాతం నిధులను (రూ.4,230 కోట్లు) కేంద్రం భరించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో స్టేషన్లలో మౌలిక సదుపాయాలతో పాటు పలు పనులను పీపీపీ విధానంలో చేప ట్టాలని ప్రతిపాదించారు. ప్రైవేట్ సంస్థల నుంచి నిధుల సేకరణలో భాగంగా సీఎం జపాన్ పర్యటనలో జైకాతో సంప్రదింపుల్లో హెచ్‌ఏఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు.
మెట్రో రెండో దశపై జైకాతో సంప్రదింపులు
సీఎం రేవంత్‌తో పాటు జపాన్ పర్యటనలో మెట్రో ఎండీ