అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి

Apr 4 2025 8:10 AM | Updated on Apr 4 2025 8:10 AM

అప్రమ

అప్రమత్తంగా ఉండాలి

మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అన్నారు.గురువారం సాయంత్రం భారీ వర్షాల నేపథ్యంలో మేయర్‌ జోనల్‌ కమిషనర్ల తో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. ఇంజనీరింగ్‌ ఐఆర్‌టీ వాహనాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి రావాలని, రోడ్డుపై నిలిచిన నీటిలో చిన్న పిల్లలు, వృద్ధులు వెళ్లకూడదని, మ్యాన్‌ హోల్స్‌ తెరవ వద్దని మేయర్‌ సూచించారు. అత్యవసరమైతే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

సమష్టి కృషితోనే సత్ఫలితాలు

సాక్షి, సిటీబ్యూరో: సీవరేజ్‌ ఓవర్‌ ఫ్లో ఫ్రీ సిటీ హైదరాబాద్‌ లక్ష్యంగా చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ రెండో విడత విజయవంతంగా పూర్తయిందని జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌ అందరి సమష్టి కృషితో సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి కష్టపడతామని వెల్లడించారు. ఇదే స్ఫూర్తి తో జున్‌ నాటికి మిగతా మాన్‌ హోళ్లను కూడా డీ సిల్టింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వర్షాకాలంలోగా సీవరేజ్‌ పైపులైన్లు, మ్యాన్‌ హోళ్లలో వ్యర్థాలు లేకుండా చూడాలన్నారు. అక్టోబర్‌ 2 నుంచి మార్చి 30 వరకు 180 రోజులు డీ సిల్టింగ్‌ పనులు చేపట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు 24,146 ప్రాంతాల్లో 3,185 కిలో మీటర్ల సీవరేజ్‌ పైపులైన్‌, 2.50 లక్షల మ్యాన్‌ హోళ్లలో డీ–సిల్టింగ్‌ పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజ్‌ ఫిర్యాదులను విశ్లేషించినట్లు చెప్పారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో చోకేజీ, రోడ్లపై సీవరేజ్‌ ఓవర్‌ ఫ్లో సమస్యలను గుర్తించామని, రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టి సారించి పరిష్కరించినట్లు ఆయన వివరించారు.

డ్రగ్స్‌ విక్రయిస్తున్న యువకుడి అరెస్టు

బంజారాహిల్స్‌: డ్రగ్స్‌ విక్రయిస్తున్న యువకుడిని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌–11 తాడిపత్రి బిర్యానీ సెంటర్‌ సెంటర్‌ వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న వెస్ట్‌గోదావరి జిల్లా, భీమవరానికి చెందిన కోపర్తి సాయి మణికంఠ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా 07 గ్రాముల కొకై న్‌, 3.7 గ్రాముల ఎక్‌టసీ పిల్స్‌ లభించాయి. ఓ పెడ్లర్‌ నుంచి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. పోలీసులు అతడి వద్ద నుంచి మత్తు పదార్థాలు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పాస్టర్‌ ప్రవీణ్‌ కుటుంబాన్ని

పరామర్శించిన సునీల్‌ కుమార్‌

కాప్రా: రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల కుటుంబాన్ని అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌ అధ్యక్షుడు, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌ పరామర్శించారు. గురువారం కాప్రా డివిజన్‌ ఈశ్వరిపురి కాలనీలోని వారి నివాసానికి వెళ్లిన సునీల్‌కుమార్‌ ప్రవీణ్‌ పగడాల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవీణ్‌ తల్లి మరియమ్మ, సోదరుడు ఆంటోని కిషోర్‌, సోదరి జ్యోతితో మాట్లాడి అంబేడ్కర్‌ ఇండియా మిషన్‌(ఏఐఎం) అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సునీల్‌కుమార్‌తో పాటు కిషోర్‌, మదిర శేషయ్య, ఎం విల్సన్‌ ఉన్నారు.

నేరాల నియంత్రణకు కార్డన్‌ సెర్చ్‌

డీసీపీ పద్మజారెడ్డి

జవహర్‌నగర్‌: కార్పొరేషన్‌ పరిధి వికలాంగుల కాలనీలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు మల్కాజిగిరి డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో 120 మంది పోలీసులతో కలిసి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. సుమారు 24 బ్లాకుల్లో 200 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ పద్మజారెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు శాంతియుత వాతావరణం కల్పించడం కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. నేరాల నియంత్రణ కోసం కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామన్నారు. జవహర్‌నగర్‌లో గంజాయి విక్రయించినా, సేవించినా పోలీసులకు సమాచారం అందించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సెర్చ్‌లో 202 వాహనాలను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా అమ్ముతున్న 17 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుషాయిగూడ ఏసీపీ మహేష్‌, జవహర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదయ్య, అడ్మిన్‌ ఎస్సై ఇద్రీస్‌అలీ, రామునాయక్‌, లక్ష్మయ్య, వేణు, పోలీసులు తదితరులున్నారు.

సీవరేజీ స్పెషల్‌ డ్రైవ్‌ విజయవంతం

జలమండలి ఎండీ అశోక్‌ రెడ్డి

అప్రమత్తంగా ఉండాలి 
1
1/1

అప్రమత్తంగా ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement