
లోక్‌సభ స్థానం: మల్కాజ్‌గిరి
స్వస్థలం: కమలాపూర్(కరీంనగర్ జిల్లా)
విద్యార్హత: డిగ్రీ
రాజకీయ నేపథ్యం: 1964 మార్చి 20న జన్మించారు ఈటల రాజేందర్. 2003లో టీఆర్‌ఎస్ పార్టీలో చేరి 2004 ఎన్నికల్లో కమలాపూర్ ఎమ్మెల్యేగా తొలి సారి ఎన్నికయ్యారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్‌గా మారింది. ఆయన 2008 ఉప ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై గెలిచి కేసీఆర్ తొలి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక శాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌర సరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లో వెద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12 న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 23,855 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.