Telangana News: స్టార్‌ రెజ్లర్‌ జాన్‌ సినా ఫైట్‌.. నేడు నగరంలో 'డబ్ల్యూడబ్ల్యూఈ' పోరు!
Sakshi News home page

గచ్చిబౌలిలో నేడు 'డబ్ల్యూడబ్ల్యూఈ' పోరు.. ప్రత్యేక ఆకర్షణగా జాన్‌ సినా

Sep 8 2023 6:26 AM | Updated on Sep 8 2023 8:31 AM

- - Sakshi

వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం..

హైదరాబాద్‌: నగరంలో ప్రతిష్టాత్మక వరల్డ్‌ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డబ్ల్యూడబ్ల్యూఈ) పోరుకు రంగం సిద్ధమైంది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం జరిగే ఈ ఈవెంట్‌ కోసం అభిమానులు పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. 16 సార్లు ప్రపంచ చాంపియన్‌, రెజ్లింగ్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ జాన్‌ సినా ఇక్కడ బరిలోకి దిగనుండటమే అందుకు కారణం. అతని ఫైట్‌ చూసేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఎగబడటంతో చాలా ముందుగానే ‘బుక్‌ మై షో’లో టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

జాన్‌ సినా భారత్‌లో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి. 2017లో భారత్‌లో చివరిసారిగా డబ్ల్యూడబ్ల్యూఈ ఈవెంట్‌ జరగ్గా.. ఆరేళ్ల తర్వాత మన దేశంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాల నుంచి కూడా రెజ్లింగ్‌ ఫ్యాన్స్‌ ఈ ఫైట్‌ను తిలకించేందుకు వస్తున్నారు. ‘సూపర్‌ స్టార్‌ స్పెక్టకిల్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఫైట్‌లో జాన్‌ సినాతో పాటు పలువురు ప్రముఖ రెజ్లర్లు పాల్గొంటున్నారు.

ఫిన్‌ బాలర్‌, రియా రిప్లీ, సేట్‌ రోలిన్స్‌ ఈ జాబితాలో ఉన్నారు. టీమ్‌ ఈవెంట్‌లో ప్రపంచ హెవీవెయిట్‌ చాంపియన్‌ రోలిన్స్‌తో కలిసి జాన్‌ సినా.. గియోవానీ విన్సీ, లుడ్విగ్‌ కై సర్ద్‌ జోడీతో తలపడతారు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ రియా రిప్లీ ప్రధాన ఆకర్షణ కానుంది. రాత్రి 7.30నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైట్‌ను ‘సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌’లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement