‘అన్నా చనిపోతున్నా’ అంటూ మెసేజ్‌ చేసి... | - | Sakshi
Sakshi News home page

‘అన్నా చనిపోతున్నా’ అంటూ మెసేజ్‌ చేసి...

Aug 31 2023 5:52 AM | Updated on Aug 31 2023 7:49 AM

- - Sakshi

హైదరాబాద్: ‘నన్ను క్షమించు అన్నా..నేను చనిపోతున్నా..నేను ఫెయిల్‌ అయ్యాను’ అంటూ ఓ వ్యక్తి తన అన్నకు ఫోన్‌లో మెసేజ్‌ చేసి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పల్‌ మేడిపల్లికి చెందిన మాదారం సునీల్‌ (38)కు భార్య, కుమారుడు ఉన్నారు. ఈయన సూర్యటవర్స్‌లోని ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఇదే సంస్థలో అతని అన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో సంస్థ ఎండీని కారులో సూర్యటవర్‌లోని కార్యాలయం వద్ద డ్రాప్‌ చేశాడు. అదే సమయంలో ఆయన అన్న భోజనం చేద్దామని ఆహ్వానించగా సమాధానం చెప్పకుండా కార్యాలయం నుంచి వెళ్లిపోయాడు.

మధ్యాహ్నం 2.24 గంటల సమయంలో వాట్సప్‌లో భార్య మొబైల్‌ ఫోన్‌ నుంచి వాయిస్‌ మెసేజ్‌ చేసి స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. తెలిసిన వాళ్లు, బంధువుల వద్ద వాకబు చేసినా ఎక్కడ ఆచూకీ దొరక లేదు. దీంతో బుధవారం రాత్రి మహంకాళి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసికున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement