అప్పటి దాకా ఆడి పాడి.. అంతలోనే మృత్యు ఒడికి | Hyderabad: Boy Falls Into Open Septic Tank, Dies - Sakshi
Sakshi News home page

అప్పటి దాకా ఆడి పాడి.. అంతలోనే మృత్యు ఒడికి

Aug 31 2023 5:52 AM | Updated on Aug 31 2023 2:36 PM

- - Sakshi

హైదరాబాద్: అప్పటి దాకా పెళ్లి వేడుకలో ఆడి పాడిన ఓ చిన్నారి అంతలోనే మృత్యు ఒడికి చేరాడు. ఈ దారుణ సంఘటన బుధవారం రాత్రి శంషాబాద్‌ పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని మే ఫేర్‌ ఫంక్షన్‌ హాలులో జరిగిన పెళ్లి వేడుకలకు నందిగామ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక దంపతుల కుమారుడు అభిజిత్‌రెడ్డి (5) తల్లి సోదరితో కలిసి వచ్చాడు.

పెళ్లిలో మ్యూజిక్‌కు అనుగుణంగా ఉత్సాహంగా నృత్యాలు కూడా చేశాడు. సాంయంత్రం నాలుగు గంటల నుంచి చిన్నారి కనిపించకపోవడంతో తల్లి మౌనికతో పాటు బంధువులు చుట్టుపక్కల వెతికారు. రాత్రి 6 గంటల వరకు కూడా కనిపించకపోవడంతో ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఫంక్షన్‌ హాలులో పరిశీలించడంతో వెనకాలే ఉన్న ఓ సంపు వద్ద బాలుడి చెప్పులు కనిపించాయి.

సంపులోకి దిగి వెతకడంతో బాలుడి మృతదేహం బయటపడింది. అప్పటి వరకు అందరి మధ్యలో ఉత్సాహంగా ఆడిపాడిన చిన్నారి మృతదేహం బయటపడడంతో పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. ఫంక్షన్‌ హాలు యజమాన్యం నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతిచెందాడని వారి కుటుంబసభ్యులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తమ ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement