Telangana Crime News: TS Crime News: 'ఇండిగో విమానం'లో మందు బాబుల వీరంగం!
Sakshi News home page

TS Crime News: 'ఇండిగో విమానం'లో మందు బాబుల వీరంగం!

Aug 25 2023 5:32 AM | Updated on Aug 25 2023 11:23 AM

- - Sakshi

హైదరాబాద్‌: మందుబాబులు విమానంలో వీరంగం చేశారు..తాగిన మైకంలో చేసిన లొల్లితో తోటి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దోహా నుంచి గురువారం మధ్యాహ్నం ఇండిగో 6ఈ1314 విమాన హైదరాబాద్‌కు బయలుదేరింది. ఖతార్‌లో పనిచేస్తున్న త్రివేండ్రంకు చెందిన నలుగురు ప్రయాణికులు దోహా విమానాశ్రయంలో డ్యూటీ ఫ్రీలో తీసుకున్న మద్యం సీసాలను బయటికి తీసి తాగడం మొదలు పెట్టారు.

దీనిని గుర్తించి ఇండిగో ఉద్యోగి తమ అనుమతి లేకుండా మద్యం తాగకూడదని వారికి సూచించారు. అయినా వారు వినకపోగా, తమకు ఇంగ్లీష్‌లో చెప్పింది అర్థం కాలేదని సమాధానం ఇచ్చారు. వీరి వైఖరితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదరు ప్రయాణికులపై ఇండిగో ఉద్యోగి గురువారం సాయంత్రం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులో తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement