ఢిల్లీ టూ రాంకోఠి! | - | Sakshi
Sakshi News home page

నగరంలో వాహనాల నకిలీ స్పేర్‌పార్ట్స్‌ విక్రయం

Aug 21 2023 5:18 AM | Updated on Aug 21 2023 8:04 AM

- - Sakshi

హైదరాబాద్: సుజుకీ కంపెనీకి చెందిన టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ల నకిలీ స్పేర్‌ పార్ట్స్‌ అమ్మకాలు చేస్తున్న రాంకోఠిలోని ‘బాలజీ ఆటో పార్ట్స్‌’ షాపుపై సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మెరుపుదాడి చేశారు. సుజుకీ కంపెనీకి చెందిన హోలోగ్రామ్‌ డూప్లికేట్‌ది తయారు చేసి ఇదే నిజమైన కంపెనీదంటూ నమ్మిస్తూ వాహనదారులను కొంతకాలంగా మోసం చేస్తున్న విషయాన్ని గుర్తించారు.

దీంతో పాటు సుజుకి కంపెనీకి చెందిన క్యూఆర్‌ కోడ్‌లను సైతం క్రియేట్‌ చేసి ఈ నకిలీ దందాకు పాల్పడుతున్నట్లు స్పష్టత వచ్చింది. దీంతో ‘బాలాజీ ఆటో పార్ట్స్‌’ షోరూంలో భారీ ఎత్తున ఫేక్‌ స్పేర్‌ పార్ట్స్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీజ్‌ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు యజమాని మహేందర్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఢిల్లీ నుంచి దిగుమతి..
రాంకోఠి కేంద్రంగా కొంతకాలంగా ద్విచక్ర, కారు, ఆటోలకు సంబంధించిన స్పేర్‌ పార్ట్స్‌ నకిలీ దందా నడుస్తుంది. ఈవిషయంపై సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పక్కా సమాచారం అందుకుని శనివారం రాత్రి ‘బాలాజీ ఆటో పార్ట్స్‌’ షోరూంపై రైడ్‌ చేశారు. షోరూంకు చెందిన మహేందర్‌ కుమార్‌ గత కొంతకాలంగా న్యూఢిల్లీ నుంచి నకిలీ స్పేర్‌ పార్ట్స్‌ను ఇక్కడకు తీసుకొస్తున్నాడు.

హోలోగ్రామ్‌ను కూడా ఇదే షోరూంలో నకిలీది తయారు చేసి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఆ పరికరాలపై వేస్తున్నారు. దీంతో పాటు క్యూఆర్‌ కోడ్‌ సైతం పరికరాల కవర్‌లపై ఉండటంతో ఎవరికీ ఇది ఫేక్‌ అని అనుమానం లేదు. న్యూఢిల్లీలో సుమారు రూ.500కు కొనుగోలు చేసిన పార్ట్స్‌ను ఇక్కడ రూ.1000కి అమ్ముతున్నారు. ఇలా కొంతకాలంగా చేస్తున్న నకిలీ స్పేర్‌పార్ట్స్‌ వ్యవహారంపై సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌ఐ సాయికిరణ్‌ రైడ్‌ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

దాదాపు రూ.10 లక్షల నకిలీ పార్ట్స్‌ సీజ్‌
రైడ్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు 14 సిలిండర్‌ పిస్టాన్‌ కిట్స్‌, 26 ఎయిర్‌ ఫిల్టర్‌లు, 6 అబ్సోర్‌బేర్‌ అస్సీ రేర్‌ షాక్‌, 45 షూసెట్‌బ్రేక్‌లు, 45 ప్లేట్‌ క్లచ్‌లు, 8 సీడీఐ యూనిట్‌లు, 5 హబ్‌ రేర్‌ వీల్స్‌, 5 ఎయిర్‌ ఫిల్టర్‌ బాక్సులు, 5 డిస్క్‌ క్లచ్‌ ప్రెజర్‌లు, 5 హబ్‌క్లచ్‌ స్టిక్కర్స్‌, 75 వారిటర్‌ బాడీలు, ఒక డెల్‌ ల్యాప్‌టాప్‌, ఒక ప్రింటర్‌, సుజుకీ క్యూ ఆర్‌కోడ్‌ స్టిక్కర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ధర దాదాపు రూ.10 లక్షలు ఉండొచ్చని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement