గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఎంబీఏ విద్యార్థి | - | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో కుప్పకూలిపోయిన ఎంబీఏ విద్యార్థి

Aug 1 2023 6:40 AM | Updated on Aug 1 2023 7:21 AM

- - Sakshi

హైదరాబాద్: హార్ట్‌ ఎటాక్‌ తో ఎంబీఏ విద్యార్థి మృతి చెందిన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ గ్రామానికి చెందిన రమేష్‌ కుమారుడు కొత్తపల్లి కుషాల్‌ ఎంబీఏ చదువుతూ మైసమ్మగూడలోని సాత్విక్‌ బాయిస్‌ హాస్టల్‌లో ఉంటున్నారు. ఆదివారం తన స్నేహితుడు సత్యగిరీశ్‌ ఉంటున్న సాయిమణి బాయిస్‌ హాస్టల్‌కు వెళ్లి రాత్రి అక్కడే నిద్రపోయాడు.

అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన కుషాల్‌ హార్ట్‌ ఎటాక్‌తో కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పేట్‌బషీరాబాద్‌ పోలీసులు హాస్టల్‌కు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement