పబ్‌లో కత్తితో నృత్యాలు! | - | Sakshi
Sakshi News home page

పబ్‌లో కత్తితో నృత్యాలు!

Jul 3 2023 9:16 AM | Updated on Jul 3 2023 9:37 AM

- - Sakshi

బంజారాహిల్స్‌: పబ్‌లో మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌లో ఏకంగా కత్తితో నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌.14లో రాక్‌ క్లబ్‌ స్కై లాంజ్‌ పేరిట పబ్‌ ఉంది.

శనివారం రాత్రి కొంత మంది యువకులు పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో డ్యాన్స్‌ ఫ్లోర్‌ వద్దకు వెళ్లి హంగామా సృష్టించారు. వీరిలో ఓ వ్యక్తి కత్తి తీసి నృత్యం చేశారు. వీరి విన్యాసాలతో మిగతా పార్టీ ప్రియులు భయంతో బయటకు పరుగులు తీసారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్‌ పోలీసులు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement