కేపీ చౌదరితో ఎవరెవరికి లింక్‌? | - | Sakshi
Sakshi News home page

కేపీ చౌదరితో ఎవరెవరికి లింక్‌?

Jul 2 2023 8:50 AM | Updated on Jul 2 2023 8:51 AM

- - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన కబాలి తెలుగు సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్‌ చౌదరి అలియాస్‌ కేపీ చౌదరితో ఇంకా ఎవరెవరికి సంబంధాలున్నాయనే కోణంలో సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ తెలుగు షో ఫేం, మరో ఇద్దరు నటీమణులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గోవా, బిహార్‌ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, క్రీడాకారులు, వైద్యులతో చౌదరికి సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈమేరకు రిమాండ్‌ రిపోర్ట్‌లోనూ ఆ 12 మంది అనుమానితుల పేర్లు, ఫోన్‌ కాల్స్‌ వివరాలు, బ్యాంకు లావాదేవీలను సైతం జతపరిచారు. వీరంతా కేపీ చౌదరి నుంచి కొకై న్‌ కొనుగోలు చేసి సేవించారా? లేక ఇతరుల కోసం కొనుగోలు చేశారా? అనే అంశాలను నిర్ధారించేందుకు పోలీసులు దర్యాప్తును సాగిస్తున్నారు.

ఆయా అంశాలపై పూర్తి ఆధారాలను సేకరించేందుకు నిందితుడు కేపీ చౌదరి ఏడాది కాలం నుంచి జరిపిన ఫోన్‌ కాల్స్‌, వాట్సాప్‌ సందేశాలు, బ్యాంకు లావాదేవీలను ప్రత్యేక దర్యాప్తు బృందం విశ్లేషిస్తోంది. ఆధారాల సేకరణ పూర్తయ్యాక 12 మంది అనుమానితుల వాంగ్మూలం కూడా సేకరించనున్నారు. ఈమేరకు త్వరలోనే వారికి నోటీసులు జారీ చేసి విచారించనున్నట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement