పట్టాల పర్యవేక్షణ మరింత పటిష్టం | GPS Trackers for Railway Trackmen | Sakshi
Sakshi News home page

పట్టాల పర్యవేక్షణ మరింత పటిష్టం

Oct 30 2026 5:55 AM | Updated on Oct 30 2026 5:55 AM

GPS Trackers for Railway Trackmen

ట్రాక్‌మెన్‌కు జీపీఎస్‌ ట్రాకర్లు 

అత్యవసర పరిస్థితుల్లో ఎస్‌ఓఎస్‌ అలర్ట్‌

హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్ల పరిధిలో 1,800 జీపీఎస్‌ పరికరాల వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: రైల్వేట్రాక్‌ల భద్రతను పటిష్టం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే జీపీఎస్‌ ఆధారిత ట్రాకింగ్‌ వ్యవస్థను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. పట్టాల సామర్థ్యాన్ని రియల్‌ టైమ్‌లో అంచనా వేసేందుకు ఇది దోహదం చేయనుంది. ట్రాక్‌లపై రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించే ట్రాక్‌మెన్, పెట్రోల్‌మెన్‌ తమ విధి నిర్వ హణలో ఈ జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరాన్ని వినియోగించి భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేస్తారు.

 అదే సమయంలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది పనితీరును ఈ ట్రాకింగ్‌ వ్యవస్థ ద్వారా పర్యవేక్షించొచ్చు. దక్షిణమధ్య రైల్వే పరిధిలోని హైదరా బాద్, సికింద్రాబాద్, నాందేడ్‌ డివిజన్‌లలో ప్రస్తుతం 1,800 జీపీఎస్‌ ట్రాకర్ల ద్వారా పటిష్టమైన భద్రతా వ్యవస్థను రూపొందిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జోన్‌ పరిధిలోని సుమారు 3,500 రూట్‌ కిలోమీటర్లను పర్యవేక్షించేందుకు దశల వారీగా మరిన్ని జీపీఎస్‌ ట్రాకర్లను ప్రవేశపెట్టనున్నారు.

ట్రాక్‌ల రియల్‌ టైమ్‌ సమాచారం కోసం
వాతావరణ మార్పులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ట్రాక్‌లలో తరచూ మార్పులు సంభవిస్తాయి. నట్‌లు, బోల్ట్‌లు ఊడిపోవడం, సంకోచ వ్యాకోచాల వంటి కారణాల వల్ల ట్రాక్‌లు దెబ్బతింటాయి. వర్షాకాలంలో వరదనీరు ట్రాక్‌లపైకి చేరి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తుంది. మరోవైపు పశువులు, మనుషులు ట్రాక్‌లపైన తిరగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి అడ్డంకులను తొలగించి రైళ్ల రాకపోకలకు ట్రాక్‌లను సిద్ధంగా ఉంచడంలో ట్రాక్‌మెన్, పెట్రోల్‌మెన్‌ కీలకమైన విధులు నిర్వర్తిస్తారు. 

ఈ మేరకు ట్రాక్‌లపైన విధులకు హాజరయ్యే ప్రతి పెట్రోల్‌మెన్, ట్రాక్‌మెన్‌కు ఒక జీపీఎస్‌ పరికరాన్ని కేటాయిస్తారు. సిమ్‌ కార్డుతో పనిచేసే ఈ పరికరాన్ని వ్యక్తిగత పరికరంగా అందజేస్తారు. ట్రాక్‌పైకి చేరిన వెంటనే సిబ్బంది ఈ పరికరాన్ని ఆన్‌ చేస్తారు. దీంతో వారి కార్యకలాపాలు, ట్రాక్‌ల డైరెక్షన్‌ తదితర వివరాలు పర్యవేక్షక అధికారులకు రియల్‌టైమ్‌లో చేరుతాయి. ట్రాక్‌మెన్‌ నుంచి వచ్చే సందేశాలకు అనుగుణంగా భద్రతా చర్యలు చేపట్టొచ్చు.

అత్యవసర పరిస్థితుల్లో ..
⇒ జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరంపై మూడు బటన్‌లు ఉంటాయి. అత్యవసర సమయాల్లో ట్రాక్‌ సిబ్బంది వీటిని వినియోగించి అధికారులను అప్రమత్తంచేస్తారు. 
⇒  మొదటి బటన్‌ నొక్కినప్పుడు ట్రాక్‌మెన్‌పైన విధి నిర్వహణలో ఉండే సాంకేతిక, పర్యవేక్షణ ఉద్యోగులకు ఫోన్‌కాల్‌ వెళుతుంది.
⇒ రెండో బటన్‌ నొక్కినప్పుడు సంబంధిత భద్రతా అధికారికి కాల్‌ వెళుతుంది. పరిస్థితి తీవ్రతను అధికారులకు నేరుగా తెలియజేయొచ్చు. 

⇒ ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కినప్పుడు సంబంధిత అధికారులందరికీ అత్యవసర హెచ్చరిక వెళుతుంది. దీంతో మొత్తం అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. విపత్తులు, ప్రమాదాలు, అనూహ్యమైన ఉపద్రవాలు తలెత్తినప్పుడు అన్ని విభాగాలు వెంటనే విధుల్లో చేరేవిధంగా ఈ ఎస్‌ఓఎస్‌ కాల్‌ అప్రమత్తం చేస్తుంది.
⇒ జీపీఎస్‌ పరికరాల్లో 6 నెలలపాటు డేటా నిల్వ చేయొచ్చు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకొని విశ్లేషించేందుకు ఈ సమాచారం దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.

ట్రాక్‌మెన్‌లు ఎంతో కీలకం
⇒  రైళ్ల సురక్షిత రాకపోకల్లో ట్రాక్‌మెన్, పెట్రోల్‌మెన్‌ కీలక పాత్ర పోషిస్తారు. రైల్వే పట్టాల పరిస్థితిని ప్రతిరోజూ క్షేత్రస్థా యిలో నడుచుకుంటూ తనిఖీ చేస్తారు. 

⇒ తనిఖీల సమయంలో పట్టాలపై చిన్నపాటి లోపాలను సైతం గుర్తించాలి. ఫిష్‌ బోల్ట్‌లు వదులుగా ఉండటం, స్విచ్‌లు, క్రాసింగ్‌ల వద్ద ఫిట్టింగుల్లో లోపాలు, గర్డర్‌ వంతెనలు, కల్వర్టుల వద్ద సమ స్యలు, స్లీపర్లు విరగడం లేదా కాలిపోవడం, ప్లేట్లు, టై బార్లు దెబ్బతినడం వంటి అంశాలను పరిశీలించాలి. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలి.

⇒ పట్టాలు విరిగిపోవడం, వెల్డింగ్‌ దెబ్బతిన డం, పట్టాల కింద ఉండాల్సిన కంకర కొట్టుకుపోవడం, పెద్ద సంఖ్యలో ఫిట్టింగులు చోరీకి గురికావడం వంటి ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే నిబంధనల ప్రకారం రైలు మార్గానికి రక్షణ కల్పించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement