వేధించే అధికారులపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వేధించే అధికారులపై చర్యలు తీసుకోవాలి

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

● టీఎన్జీవోస్‌ కేంద్ర సంఘం

హన్మకొండ అర్బన్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని టీఎన్జీవోస్‌ యూనియన్‌ నేతలు డిమాండ్‌ చేశారు. కొంతమంది అధికారులు కలెక్టర్ల పేర్లు చెబుతూ ఉద్యోగులను అభద్రతాభావానికి గురిచేస్తూ, అవమానపరుస్తూ, భ యభ్రాంతులకు గురిచేస్తున్నారని పలువురు జిల్లా నాయకులు కేంద్ర సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన టీఎన్జీవోస్‌ నేతలు నాంపల్లిలోని కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ముజీబ్‌ హుస్సేనీని కలిసి సమస్యలను వివరించారు. ఉద్యోగులను వేధిస్తున్న అధికా రులపై చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రి, ప్రభుత్వ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ముజీబ్‌ హుస్సేనీ మాట్లాడుతూ.. సమస్యను సీఎం, సీఎస్‌ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. అనంతరం కేంద్ర సంఘం నాయకులను శాలువాలతో సన్మానించి దసరా శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్‌, జనగామ, ములుగు జిల్లాల అధ్యక్షులు ఆకుల రాజేందర్‌, గాజె వేణుగోపాల్‌, ఖాజా షరీఫ్‌, పోలురాజుతో పాటు ఆయా జిల్లాల కార్యదర్శులు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలు శ్యాంసుందర్‌, బైరి సోమయ్య, శ్రీనివాస్‌, నాగరాజు, ప్రభాకర్‌రావు, హఫీజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement