కష్టించే తత్వం. పట్టుసడలని లక్ష్యం. నిరంతర సాధన వారిని లక్ష్యం వైపు నడిపించింది. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిపాయి. ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికై న డ్యాగల సాయిపవన్‌, ఫర్హానా తబస్సుమ్‌, ట్రెయినీ డీఎస్పీ షా గుఫ్తా యాస్మిన్‌ మనోగతమే ఈ ఆదివారం ‘సాక | - | Sakshi
Sakshi News home page

కష్టించే తత్వం. పట్టుసడలని లక్ష్యం. నిరంతర సాధన వారిని లక్ష్యం వైపు నడిపించింది. ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిపాయి. ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిలుగా ఎంపికై న డ్యాగల సాయిపవన్‌, ఫర్హానా తబస్సుమ్‌, ట్రెయినీ డీఎస్పీ షా గుఫ్తా యాస్మిన్‌ మనోగతమే ఈ ఆదివారం ‘సాక

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

– IIలోu అమ్మవారి సన్నిధిలో ‘గరివిడి లక్ష్మి’ చిత్ర బృందం రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు హసన్‌పర్తి విద్యార్థులు ‘సూపర్‌’ ఆస్పత్రి పరిశీలన ‘కల్పలత సూపర్‌బజార్‌ పాలనాధికారిగా వెంకటేశ్‌ ఖాళీగా వరంగల్‌ ఏసీపీ పోస్టు వరంగల్‌ అభివృద్ధి పనులపై కలెక్టర్‌ సమీక్ష

న్యూస్‌రీల్‌

శ్రమే నా ఆయుధం..

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం సాయంత్రం ‘గరివిడి లక్ష్మి’ చిత్ర బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు గాదె శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మోతుకూరి మయూరి, కమటం వేణుగోపాల్‌, చిదురాల అంజనీదేవి చిత్ర యూనిట్‌ను ఆలయ మర్యాదలతో స్వాగతించారు, అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు.

హసన్‌పర్తి: రాష్ట్రస్థాయి బాక్సింగ్‌ పోటీలకు హసన్‌పర్తికి చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల నగరంలో జరిగిన 70 ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి జిల్లాస్థాయి అండర్‌–17 పోటీల్లో తనుశ్రీ(ఎస్సార్‌ కాలేజీ), ఎస్‌.లాస్య(మాంటిస్సోరి), బి.వైష్ణవి, పి.వరుణ్‌, ఇ.అభినవ్‌, జి.విశ్వతేజ (జెడ్పీఎస్‌ఎస్‌, హసన్‌పర్తి) పాల్గొని రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈనెల 25 నుంచి రెండురోజుల పాటు హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లో జరగనున్న రాష్ట్రపోటీల్లో వీరు పాల్గొంటారు. ఈసందర్భంగా శనివారం హసన్‌పర్తి జిల్లా పరిషత్‌ పాఠశాలలో క్రీడాకారులను కాంగ్రెస్‌ డివిజన్‌ అధ్యక్షుడు గొర్రె కిరణ్‌, మాజీ కార్పొరేటర్‌ గురుమూర్తి శివకుమార్‌, దేవస్థాన మాజీ చైర్మన్‌ ఆరెల్లి వెంకటస్వామి అభినందించారు.

కాశిబుగ్గ: వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని డీఎంఈ డాక్టర్‌ వాణి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నిర్మాణ పనులతోపాటు రోగులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. ఇప్పటికే ఓపీ సేవల ప్రారంభం కోసం గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు ఫస్ట్‌ ఫ్లోర్‌లో చేసిన ఏరాట్లను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ విమలా థామస్‌, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకుమార్‌రెడి, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మోహన్‌దాస్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ అశ్విని ఉన్నారు.

హన్మకొండ అర్బన్‌/

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ రంగంపేటలోని కల్పలత సూపర్‌ బజార్‌ కోఆపరేటివ్‌ స్టోర్‌ అధికారిక పాలనాధికారిగా హనుమకొండ ఆర్డీఓ ఎన్‌.వెంకటేశ్‌ను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ నియమించారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కల్పలత సూపర్‌ బజార్‌లో దాదాపు రూ.80 లక్షల నిధులకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు జిల్లా సహకార అధికారి బాణావత్‌ మోహన్‌ నిర్వహించిన ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గత నెలలో కె.కోదండరాములును అధికారిక పాలనాధికారిగా నియమించారు. అయితే, స్టోర్‌ నిర్వహణలో పారదర్శకత పెంచడంతోపాటు నిధుల వ్యవహా రాలపై సమగ్ర విచారణ జరిపేందుకు కలెక్టర్‌ చర్యలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్టోర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంధ్యారాణికి వెంకటేశ్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.

‘నా కల నిజం కావడానికి 11 ఏళ్లు పట్టింది. చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ, ఏకాగ్రతతో పట్టుదలతో చదివితే ఎవరైనా విజయం సాధించవచ్చు. పట్టు వదలకుండా కన్సిస్టెన్సీ మెయింటెయిన్‌ చేయడమే ఏ రంగంలోనైనా విజయానికి అసలైన రహస్యం’ అని ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై న భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన డ్యాగల సాయి పవన్‌ అంటున్నారు. సాయి పవన్‌ విజయ ప్రయాణం ఆయన మాటల్లోనే..

ఎన్నో వైఫల్యాలు.. చెరగని ఆత్మవిశ్వాసం

మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మానాన్న ఇద్దరూ ఉపాధ్యాయులే. చెల్లి బిట్స్‌ పిలానీ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్‌ పొందింది. నాకు మొదటి నుంచి లా డిగ్రీ చేయాలన్నది బలమైన కోరిక. నాన్న సూచన మేరకు ఇంటర్‌లో ఎంపీసీ తీసుకుని, హుజూరాబాద్‌లోని కిట్స్‌ కాలేజీలో ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (ట్రిపుల్‌ ఈ) పూర్తి చేశాను. ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు ప్రిపేరవుతూనే దాదాపు 16 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యా. ఆర్మీ, కోస్ట్‌గార్డ్‌ వంటి ప్రతిష్టాత్మక డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూలకూ వెళ్లా. అయితే అదృష్టం కొన్నిసార్లు చిన్న తేడాతో దూరమయ్యేది. రెండు సార్లు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై) పరీక్షలో కేవలం 3 సెకండ్లు, 0.14 మిల్లీసెకండ్ల వ్యవధితో ఈవెంట్స్‌ మిస్‌ అవడం తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినా పట్టువదల్లేదు.

తలుపు తట్టిన విజయం

2018లో జీవితంలో నాకు తొలి విజయం తలుపు తట్టింది. దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఎల్‌ఎల్‌బీ ఆనర్స్‌ ప్రవేశ పరీక్షను క్లియర్‌ చేసి అడ్మిషన్‌ పొందాను. అక్కడే లా పూర్తి చేశాక ఢిల్లీలోని ప్రముఖ లా ఫోరమ్స్‌లో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అయినా వాటిని సున్నితంగా తిరస్కరించా. నా లక్ష్యం న్యాయమూర్తి (జడ్జి) కావాలనే కల వైపే నా అడుగులు పడ్డాయి.

సవాళ్లు, పాఠాలు

జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షకు సన్నద్ధమవడం మొదలుపెట్టాను. రెండు సార్లు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ క్లియర్‌ చేసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాను. అయితే రెండోసారి కూడా చివరి దశలో సెలెక్ట్‌ కాకపోవడంతో కుంగిపోకుండా ఆత్మపరిశీలన చేసుకున్నాను. కేవలం కష్టపడితే సరిపోదని, ‘స్మార్ట్‌ వర్క్‌’ కూడా చాలా అవసరమని గ్రహించాను. నాతో పాటు ఇంటర్వ్యూ వరకు వెళ్లి, నాకు ముందు బ్యాచ్‌లలో జడ్జిలుగా ఎంపికై న నా మిత్రుల సహాయం తీసుకున్నాను. ప్రతీ దశకు ఒక స్పష్టమైన వ్యూహాన్ని రూపొందించుకుని ప్రిపరేషన్‌ సాగించాను.

న్యూశాయంపేట: జిల్లా పరిధిలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో కార్మికులకు, పరిశ్రమలకు అవసరమైన వసతుల కల్పనపై కలెక్టరేట్‌లో వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద శనివారం సమీక్ష నిర్వహించారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిశోర్‌కుమార్‌, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సంగెం తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌, జోనల్‌ మేనేజర్‌ స్వామి, అధికారులు పాల్గొన్నారు. అలాగే, జాతీయ రహదారి 163జీ పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద కలెక్టరేట్‌లో శనివారం సమీక్షించారు.

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ సబ్‌ డివిజన్‌కు గ్రహణం పట్టింది. ఏసీపీ పోస్టు ఖాళీ అయ్యి ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఇక్కడ పూర్తిస్థాయి అధికారిని నియమించకపోవడం పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్న విమర్శలున్నాయి. గతంలో ఇక్కడ పనిచేసిన యువ ఐపీఎస్‌ అధికారి నగ్రాలె శుభమ్‌ ప్రకాశ్‌.. 2026 ఏప్రిల్‌లో నిజామాబాద్‌ అదనపు డీసీపీగా బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ప్రస్తుతం హనుమకొండ ఏసీపీకి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆయన తన సొంత డివిజన్‌ను చూసుకుంటూ ఇక్కడికి పూర్తి సమయం కేటాయించలేకపోతుండడంతో ఇన్‌చార్జ్‌ పాలన అంతంతమాత్రంగానే సాగుతోంది. ఫలితంగా వరంగల్‌ పోలీసు డివిజన్‌ కిందికి వచ్చే మట్టెవాడ, ఇంతేజార్‌గంజ్‌, మిల్స్‌కాలనీ ఠాణాల్లో నేర ఘటనలపై పర్యవేక్షణ కరువైందన్న విమర్శలున్నాయి.

రాజకీయ వైషమ్యాలు.. గ్రూపుల తగాదాలు

ఏసీపీ బాధ్యతలు చేపట్టేందుకు సీనియర్‌ ర్యాంకర్‌ అధికారులు, సీఐలుగా పనిచేసి పదోన్నతి పొందిన వారు పెద్దగా ఆసక్తి చూపకపోవడానికి వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని రాజకీయ వైషమ్యాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక్కడ అధికార పార్టీలోనే అంతర్గతంగా గ్రూపులు ఉండడం, ఒకవర్గం చెప్పినట్లు వింటే మరోవర్గం ఒత్తిడి తేవడం వంటి పరిణామాలతో అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తుండడంతో ఈ రాజకీయ చదరంగంలో తాము బలికాకూడదనే ఉద్దేశంతో సమర్థులైన అధికారులు సైతం ఈ పోస్టుకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

మూడు ఠాణాల పరిధిలో కరువైన పర్యవేక్షణ

వరంగల్‌ డివిజన్‌ పరిధిలోని మూడు కీలక పోలీసు స్టేషన్లయిన ఇంతేజార్‌గంజ్‌, మట్టెవాడ, మిల్స్‌ కాలనీలపై ఏసీపీ స్థాయి పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ఆయా స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్య కలాపాలు, శాంతిభద్రతల సమస్యలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో నిఘా కరువవడంతో ఓ వ్యక్తి పీఎస్‌ లోపలే పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి స్టేషన్‌ సమీపంలోనే డీజిల్‌ పోసుకుని బలవన్మరణానికి యత్నించడం సంచలనం సృష్టించింది. కరీమాబాద్‌ ప్రాంతం బీరన్నకుంటల్లో బర్త్‌డే సందర్భంగా యువకులు తల్వార్‌ తిప్పుతూ బైక్‌పై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. అంతకుముందే ఇక్కడి ఓ ఎస్సైపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ సస్పెండ్‌ చేశారు. అలాగే, ఇంతేజార్‌గంజ్‌ పరిధిలో యువతను, మైనర్లను టార్గెట్‌ చేస్తూ వారికి గంజాయి అలవాటు చేసి వ్యభిచార ఊబిలోకి దించుతున్న అంతర్రాష్ట్ర ముఠాలను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. మట్టెవాడ ఠాణా పరిధిలో ఇంట్లో పని మనుషులుగా కుదిరి ఓ రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగిని హత్యచేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇలా ఏదో రూపంలో ఘటనలు జరుగుతుండడంతో వాటిపై పర్యవేక్షణకు ఏసీపీ అవసరం కనిపిస్తోంది.

ఆదర్శం యువ జూనియర్‌ సివిల్‌ జడ్జిలు, ట్రెయినీ డీఎస్పీ..

గ్రామీణ నేపథ్యం.. ఉన్నత లక్ష్యాలు

వారి విజయ ప్రస్థానమే ‘సాక్షి’ సండే స్పెషల్‌

ఆరు నెలలు గడుస్తున్నా

ఆసక్తి చూపని ర్యాంకర్‌ ఆఫీసర్లు

ఎన్‌.శుభమ్‌ ప్రకాశ్‌ బదిలీ తర్వాత నిరీక్షణ

తూర్పులో రాజకీయ వైషమ్యాలే ప్రధాన కారణమా?

క్రైమ్‌ రేటు కట్టడికి అవసరమే..

నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. కీలక ప్రాజెక్టులు నడుస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కూడా త్వరలో ప్రారంభం కానుంది. వరంగల్‌ మోడ్రన్‌ బస్టాండ్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కీలకమైన రైల్వే స్టేషన్‌ ఉంది. బంగారు దుకాణాలు, బట్టల దుకాణాల హోల్‌సేల్‌ వ్యాపారం ఉంది. భూ కబ్జాల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. వాటిన్నింటిని దృష్టిలో ఉంచుకొని క్రైమ్‌ రేటును కట్టడి చేసేందుకు వరంగల్‌ ఏసీపీ పోస్టు భర్తీ ఎంతో కీలకం కానుంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వరంగల్‌ వాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement