ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 25 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

ఉమ్మడి జిల్లాలో అక్టోబర్‌ బిల్లింగ్‌ రూ.313.36 కోట్లు

హన్మకొండ: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతోపాటు ఎండలు దంచికొడుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఓ వైపు ఉక్కపోతతో విద్యుత్‌ ఉపకరణాల వాడకం పెరిగింది. మరోవైపు వ్యవసాయ మోటార్లు నడుస్తుండడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. మీటర్లు గిర్రున తిరగడంతో బిల్లులు పెరిగి షాకిస్తున్నాయి. వర్షాకాలంలోనూ వేసవి నాటి బిల్లులు వస్తుండడంతో విద్యుత్‌ వినియోగదారులు మొత్తుకుంటున్నారు.

వేసవి పరిస్థితులు..

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో వర్షాకాలంలో భారీ వర్షాలు కురిసిన సందర్భాలు అరుదు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడడంతో వాతావరణంలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. అదే ఉక్కపోత కొనసాగుతోంది. దీంతో గృహాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, ఇతర కార్యాలయాల్లోను ఏసీలు, కూలర్లు వేసవికి దీటుగా వినియోగిస్తున్నారు. విద్యుత్‌ వినియోగం పెరిగి ఆ మేరకు బిల్లులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి.

విద్యుత్‌ వినియోగదారులు,

సర్వీసులు ఇలా..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎల్‌టీ కేటగిరీలో 19,14,026 వినియోగదారులుండగా, ఇందులో 12,95,089 మంది గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు 1,63,730 మంది, పరిశ్రమలు 9,045, కుటీర పరిశ్రమలు 2,301, వీధి దీపాలు 21,487, సాధారణం 10,749, తాత్కాలిక వినియోగదారులు 2,766, ఈవీ చార్జింగ్‌ సర్వీస్‌లు 60 ఉన్నాయి.

120.49

109.58

99.66

● ఎల్‌నినోతో తగ్గని ఉష్ణోగ్రతలు..

పెరిగిన విద్యుత్‌ వినియోగం

● బిల్లులు చూసి మొత్తుకుంటున్న వినియోగదారులు

86.38

53.81

44.26

41.90

37.32

33.23

28.97

30.30

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 2026లో జిల్లాల వారీగా

బిల్లింగ్‌ (డిమాండ్‌) వివరాలు (రూ.కోట్లలో)

24.94

23.55

54.43

21.85

8.14

8.12

7.65

సెప్టెంబర్‌–2026

సెప్టెంబర్‌–2025

అక్టోబర్‌–2026

అక్టోబర్‌–2025

బిల్లింగ్‌ ఇలా..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ ఏడాది జనవరిలో రూ.177.41 కోట్లు కాగా, సెప్టెంబర్‌లో 367.13 కోట్లు, అక్టోబర్‌లో 313.36 కోట్ల బిల్లింగ్‌ అయ్యింది.

ఈ ఏడాది జనవరితో చూసుకుంటే సెప్టెంబర్‌ నాటికి రూ.187.72 కోట్లు పెరిగింది. అక్టోబర్‌ నాటికి రూ.135.95 బిల్లింగ్‌ అదనంగా పెరిగింది.

గత సంవత్సరం సెప్టెంబర్‌లో రూ.237.10 కోట్లు, అక్టోబర్‌లో రూ.201.38 కోట్ల బిల్లింగ్‌ అయ్యింది. గతేడాదితో ఈ సెప్టెంబర్‌ను పోలిస్తే రూ.130,03 కోట్లు, అక్టోబర్‌లో రూ.111.98 కోట్ల బిల్లింగ్‌ పెరిగింది.

69.06

41.18

28.39

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement