బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వాలి

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

బాధితులకు త్వరగా పరిహారం ఇవ్వాలి

హన్మకొండ అర్బన్‌: బాధిత ఎస్సీ, ఎస్టీలకు త్వరగా పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లాస్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్‌్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులు, భూసమస్యలు, బాధితులకు పరిహారం చెల్లింపు తదితర అంశాలపై కమిటీ సభ్యులు, రెవెన్యూ, పోలీస్‌, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. కమిటీ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, పుట్ట రవి, రాజేందర్‌, సింగారపు రవిప్రసాద్‌, రడపాక పరంజ్యోతి, నూనవత్‌ జవహర్‌లాల్‌, ఎస్సీ సంక్షేమ శాఖ ఉపసంచాలకురాలు నిర్మల, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు వెంకటేశ్‌, డీఎస్‌ వెంకన్న, ఏసీపీ నరసింహారావు, సతీశ్‌బాబు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

40 ఎకరాలు సర్వే చేయాలి

హసన్‌పర్తి: ప్రతి రోజు 40 ఎకరాల మేరకు భూముల సర్వే చేపట్టాలని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి ఆదేశించారు. జయగిరి, లక్నవరంలో చేపట్టిన భూముల రీసర్వేను శనివారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేపట్టాలని ఆదేశించారు. తహసీల్దార్‌ పూజారి కిరణ్‌కుమార్‌, సర్వేయర్‌ సుజాత, లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement