హన్మకొండ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను శుక్రవారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సెక్రటరీ జనరల్ బక్క దానయ్య, అసోసియేషన్ నాయకులు కలిశారు. విద్యుత్ ఎ స్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు వివరించి పరి ష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీతో స్వయంగా మా ట్లాడారు. విద్యుత్ సంస్థల సీఎండీలు అందరి తోపాటు ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సా ధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో సమావేశం ఏర్పాటు చేసి, ఈ సమస్య ను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీ సుకుంటామని మంత్రి హామీ ఇచ్చారని ఆరెపల్లి మోహన్, బక్క దానయ్య తెలిపారు. కార్యక్రమ ంలో అసోసియేషన్ బాధ్యులు అరెపల్లి శ్రీని వాస్, కె.ఉపేందర్, దయానంద్ పాల్గొన్నారు.


