● హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మక్కలకు రికార్డు స్థాయిలో రూ.3,033 ధర పలికింది. సీజన్ ప్రారంభం నుంచే మద్దతు ధర రూ.2,400 మించి ధర పలుకుతూ వస్తోంది. ఈనెల 14న గరిష్ట ధర రూ.2,901, కనిష్ట ధర రూ.2,611 పలుకగా, 15న గరిష్ట రూ.2,916, కనిష్ట రూ.2,654, 16న గరిష్ట రూ.2,989, కనిష్ట ధర రూ. 1,501 పలికింది. ఈ క్రమంలో మార్కెట్‌కు 3,610 బస్తాలు అమ్మకానికి రాగా, గరిష్టంగా రూ.3,033, కని ష్టంగా రూ.2,629 ధర పలికింది. మార్కెట్ చరి త్రలోనే మక్కలకు రికార్డుస్థాయిలో ధర పలికినట్లు అధికారులు తెలిపారు. కాగా, మక్కల ధర రోజురోజుకూ పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఏనుమాములలో క్వింటా ధర రూ.2,895..
ఖిలా వరంగల్: వ రంగల్ ఏనుమాము ల వ్యవసాయ మా ర్కెట్‌లో మొక్కజొన్నకు గురువారం రికార్డు ధర పలికింది. రాయపర్తి మండలం కుమ్మరిపల్లెకు చెందిన రైతు చెక్క రవి 42 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకురాగా.. ఓ వ్యాపారి క్వింటాలుకు రూ.2,895 చొప్పున కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో మక్కలకు ఈస్థాయి ధర లభించడం మొదటిసారని మార్కెట్ చైర్‌పర్స న్ ప్రియాంక, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
మైనార్టీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ
కాజీపేట అర్బన్ : పీఎం వికాస్ పథకం ద్వారా మైనార్టీ విద్యార్థులకు ఉచిత నైపుణ్య శిక్షణ అందజేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. 18 నుంచి 45 ఏళ్లలోపు పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్,ఇంజనీరింగ్, డిగ్రీ పూర్తి చేసినా లేదా విద్యనభ్యసిస్తున్న ముస్లిం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన్ విద్యార్థులు అర్హులు. మూడు నుంచి నాలుగు నెలల పాటు కొనసాగనున్న ఈ శిక్షణలో 600 మంది విద్యార్థులకు అ వకాశం కల్పిస్తూ ప్రతీ నెల రూ. వెయ్యి స్టైఫండ్‌తో పాటు ఉచిత హాస్టల్, భోజనం అందజేయనున్నట్లు తెలిపింది. నాలుగు సాంకేతిక కో ర్సులు టెక్నీషియన్ (సీఎన్‌సీ మెషీన్), జూని యర్ డిజైనర్ (క్యాడ్, క్యామ్)జూనియర్ టెక్నీషియన్ (వెల్డింగ్), టెక్నీషియన్ (కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో మల్టీ స్కిల్) శిక్షణ అందజేయనున్నారు. శిక్షణ నవంబర్ 2 నుంచి ప్రారంభం కానుంది. శిక్షణ ప్రారంభానికి ముందు రోజు వరకు forms.gle/kkvdjnuxnz6eDvDa9 అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, లేదా 9948063593, 9393063053, 9963640386 నంబ ర్లలో సంప్రదించాలని నిట్ యాజ మాన్యం తెలిపింది.


